Breaking News

ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆరోపణల పిల్‌ కొట్టివేత 

Published on Sat, 06/20/2026 - 04:34

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేల కొనుగోళ్లు, రాజకీయ ఫిరాయింపులు పెరిగిపోయాయంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) సుప్రీంకోర్టు కొట్టివేసింది. తగిన ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది.కేకే రమేశ్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ వి.మోహనలతో కూడిన ధర్మాసనం.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సి.ఆర్‌. జయ సుకిన్‌ వాదనలు వినిపిస్తూ.. దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తున్నాయని వ్యాఖ్యానించారు. 

డబ్బు, బెదిరింపులకు పాల్పడి అధికార పార్టీలు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్విర్యం చేస్తున్నాయన్నారు. పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన వెంటనే ప్రత్యర్థి పార్టీల్లో చేరుతున్నారని, ప్రత్యేక విమానాల్లో వారిని క్యాంపులకు తరలిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టీకల్‌ 190 ప్రకారం ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆమోదించాల్సి ఉన్నప్పటికీ, ఆ నిబంధనలను పూర్తిగా పక్కనపెడుతున్నారని చెప్పారు. ఈ అంశాలపై జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే, పిటిషనర్‌ వాదనలపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)