Breaking News

వీడియో: అమరన్‌ సినిమా ఆడుతున్న థియేటర్‌పై పెట్రోల్‌ బాంబు దాడి

Published on Sat, 11/16/2024 - 10:57

చెన్నై: తమిళనాడులో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. అమరన్‌ సినిమా నడుస్తున్న థియేటర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు విసిరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై థియేటర్‌ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

వివరాల ప్రకారం.. చెన్నై తిరునల్వేలి జిల్లా మేలప్పాలయంలోని అలంకార్ థియేటర్‌పై శనివారం తెల్లవారుజామున పెట్రోల్ బాంబు దాడి జరింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు థియేటర్‌పై పెట్రోల్‌ బాంబులు విసిరారు. బాంబు దాడి నేపథ్యంలో పెద్ద శబ్ధం వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ధియేటర్‌లో శివకార్తికేయన్‌ నటించిన అమరన్ సినిమా ప్రదర్శన కొనసాగుతోంది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

పెట్రోల్‌ బాంబు దాడులపై థియేటర్‌ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాపు చేపట్టినట్టు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు. అయితే, శివకార్తికేయన్‌ అంటే గిట్టని వ్యక్తులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

అమరన్‌ సినిమా నడుస్తున్న థియేటర్‌పై బాంబులు విసిరారు

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)