Breaking News

‘స్థానిక’ రిజర్వేషన్లపై ప్రీంకోర్టులో సవాల్‌

Published on Sun, 10/05/2025 - 01:41

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు ఇది విరుద్ధమని పేర్కొంటూ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ సోమవారం విచారణకు రానుంది. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయనుందని, ఇది సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఉల్లంఘించడమేనని వంగ గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో సెప్టెంబర్‌ 29న పిటిషన్‌ దాఖలు చేశారు.

అంతేగాక స్థానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను గోపాల్‌రెడ్డి సవాల్‌ చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏ వర్గానికి కేటాయించే రిజర్వేషన్లు అయినా మొత్తం 50 శాతానికి మించకూడదని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ నిబంధనను అతిక్రమిస్తోందని పిటిషన్‌లో ఆయన ఆరోపించారు. ఈ పిటిషన్‌ను సోమవారం జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. దీంతో ఈ విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)