Breaking News

న్యాయ సహాయం నైతిక బాధ్యత

Published on Mon, 11/10/2025 - 02:00

న్యూఢిల్లీ: ప్రజలకు న్యాయ సహాయం అందించడం అనేది కేవలం దాతృత్వ చర్య మాత్రమే కాదని.. అదొక నైతిక బాధ్యత అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ స్పష్టంచేశారు. న్యాయ సహాయ ఉద్యమంలో పాల్గొనేవారు చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని, కక్షిదారుల పట్ల సేవాదృక్పథంలో మెలగాలని సూచించారు. ఆదివారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ‘న్యాయ సహాయ యంత్రాంగాల బలోపేతం’అనే అంశంపై జాతీయ సదస్సు ముగింపుతోపాటు ‘లీగల్‌ సర్విసెస్‌ డే’కార్యక్రమంలో జస్టిస్‌ గవాయ్‌ మాట్లాడారు.

తదుపరి సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌తోపాటు సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెందిన న్యాయమూర్తులు పాల్గొన్నారు. నేషనల్‌ లీగల్‌ సర్విసెస్‌ అథారిటీ(నల్సా), స్టేట్‌ లీగల్‌ సర్విసెస్‌ అథారిటీ(ఎస్‌ఎల్‌ఎస్‌ఏ)ల్లో సలహా కమిటీని ఏర్పాటు చేయాలని జస్టిస్‌ గవాయ్‌ సూచించారు. విధానపరమైన ప్రణాళికలు సజావుగా కొనసాగేలా చూడడానికి ఈ కమిటీలు అవసరమని చెప్పారు. న్యాయ సహాయం అనేది ప్రభుత్వ పరిపాలనలో ఒక భాగమని వివరించారు. ప్రతి ఒక్కరికీ న్యాయ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు.

న్యాయ సహాయకులు న్యాయ పాలకులుగా వ్యవహరించాలని పేర్కొన్నారు. మనం చేసే ప్రతి ప్రయత్నం ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలన్నారు. తాను ‘నల్సా’లో ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సేవలందించానని జస్టిస్‌ గవాయ్‌ వెల్లడించారు. అప్పట్లో జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌తో కలిసి పనిచేశానని చెప్పారు. విధి నిర్వహణలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు కలిసి వెళ్లేవాళ్లమని గుర్తుచేసుకున్నారు. మన రాజ్యాంగ ఆత్మ వ్యక్తీకరణకు న్యాయ సహాయ ఉద్యమం ఒక చక్కటి ఉదాహరణ అని అభివర్ణించారు.  

ఉత్సాహంగా లాయర్ల వాకథాన్‌  
ఢిల్లీలో ఆదివారం లాయర్ల వాకథాన్‌ ఉత్సాహంగా జరిగింది. సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ చీఫ్‌ వికాస్‌ సింగ్‌ జెండా ఊపి వాకథాన్‌ను ప్రారంభించారు. సుప్రీంకోర్టు ప్రాంగణం నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని ఇండియా గేట్‌ దాకా లాయర్ల నడక కొనసాగింది. ఈ కార్యక్రమంలో జస్టిస్‌ గవాయ్‌తోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ జె.కె.మహేశ్వరి, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ సహా 2,000 మంది న్యాయవాదులు పాల్గొన్నారు. అలాగే వాకథాన్‌ సందర్భంగా న్యాయమూర్తులు మొక్కలు నాటారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)