Breaking News

‘బాంబు పేలింది’.. భూకంపం అనుభవాల వెల్లువ

Published on Mon, 02/17/2025 - 09:48

న్యూఢిల్లీ: ఈరోజు (సోమవారం) ఢిల్లీ ప్రజలు తెల్లవారుజామున నిద్ర నుంచి లేస్తూనే భూకంప ప్రభావానికి లోనయ్యారు. భయంతో వణికిపోతూ ఇళ్ల నుంచి  బయటకు పరుగులు తీశారు. ఉదయం 5 గంటల 36 నిముషాలకు సుమారు 55 సెకెన్లపాటు ఢిల్లీలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.0గా నమోదయ్యింది. భూకంపం వచ్చిన సమయంలో తమకు ఎదురైన అనుభవాలను పలువురు ట్వట్‌ల ద్వారా పంచుకున్నారు.
 

‘ఎక్స్‌’ ప్లాట్‌ఫారంపై నవనీత్‌ సింగ్‌ అనే యూజర్‌ భూకంపం సమయంలో తమ ఇంటిలో కదులుతున్న ఫ్యానుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. మరో యూజర్‌ బాంబు పేలిందని అనుకున్నామని రాశారు.

@swaris16 అనే యూజర్‌ ‘ఆ సమయంలో వచ్చిన భారీ శబ్ధం నిద్ర ఎగిరిపోయేలా చేసింది’ అని రాశారు. దీనిని చూసిన ఒక యూజర్‌ ‘ఆ శబ్ధం ఉలిక్కిపడేలా చేసిందని’ పేర్కొన్నారు.

అనిష్‌ అనే యూజర్‌ ‘ఢిల్లీలో ఉదయం 05:37కు తీవ్రమైన ప్రకంపన వచ్చింది. ఆ సమయంలో నేను ఆస్పత్రిలో ఉన్నాను. ఇక్కడి సిబ్బంది అందరినీ బయటకు పంపించివేశారు’ అని రాశారు.

ఇంకొక యూజర్‌ ‘ఢిల్లీలో కొద్ది సెకెన్లపాటు భూకంపం వచ్చింది. సొసైటీలోని వారంతా ఉలిక్కిపడ్డారు’ అని రాశారు. మరొకరు ‘ఇది భయానక అనుభవం’ అని పేర్కొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)