Breaking News

ప్రభుత్వ ఆస్పత్రి టాయిలెట్‌లో పెన్‌ కెమెరా

Published on Thu, 12/05/2024 - 12:01

అన్నానగర్‌: కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రిలోని మహిళా మరుగుదొడ్డిలో కెమెరా పెట్టిన వైద్యుడిని సస్పెండ్‌ చేస్తూ ఆస్పత్రి డీన్‌ ఆదేశాలు జారీ చేశారు. వివరాలు.. కృష్ణగిరి జిల్లా ఊత్తంగరై సమీపంలోని పనమరతుపట్టికి చెందిన వెంకటేషన్‌(33) కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నాడు. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ శిక్షణ కోసం వెంకటేషన్‌ గత నెల 16న పొల్లాచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ మహిళల వాష్‌ రూమ్‌ల పెన్‌ కెమెరా ను అమర్చాడు. ఈ క్రమంలో గత నెల 28వ తేదీన నర్సింగ్‌ విద్యార్థిని పబ్లిక్‌ టాయిలెట్‌ వద్దకు వెళ్లింది.

 అక్కడ దాచిన పెన్ను కెమెరాకు రబ్బరు బ్యాండ్‌ చుట్టిన టాయిలెట్‌ బ్రష్‌ కనిపించింది. దిగ్భ్రాంతితో పెన్ను కెమెరాతో బయటకు వచ్చింది. ఆ ప్రాంతంలో నిలబడిన వెంకటేషన్‌ వివరణ కోరింది. ఆపై ఆ పెన్ను కెమెరాను తీసుకుని విచారిస్తానని చెప్పి ఆమెని పంపించి వేశాడు. వెంకటేషన్‌ మరుసటి రోజు పనికి వెళ్లలేదు. దీంతో విద్యార్థిని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజా వద్ద సమాచారం అందించింది. వెంటనే ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కెమెరా రికార్డులను పరిశీలించినప్పుడు వెంకటేషన్‌ ఆ మరుగుదొడ్డికి వెళ్లడం రికార్డు అయ్యింది.

ఆ తర్వాత అతడిని పిలిపించి విచారించగా సీక్రెట్‌ కెమెరా పెట్టినట్లు ఒప్పుకున్నాడు. దీంతో సూపరింటెండెంట్‌ రాజా పొల్లాచ్చి ఈస్ట్‌ పోలీస్‌ స్టేష¯న్‌లో ఫిర్యాదు చేశారు. స్పెషల్‌ ఫోర్స్‌ పోలీసులు దర్యాప్తు చేసి వెంకటేశన్‌ను అరెస్టు చేశారు. అతని గదిలోని సెల్‌ఫోన్‌ మెమొరీ కార్డును స్వా«దీనం చేసుకున్నారు. ఈ పరిస్థితిలో కోయంబత్తూరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌ డీన్‌ నిర్మలా బుధవారం విధుల నుంచి  వెంకటేశన్‌ను సస్పెండ్‌ చేశారు.   

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)