Breaking News

‘హోర్డింగ్‌ ప్రమాదాలకు కంపెనీలదే బాధ్యత’

Published on Sun, 09/01/2024 - 07:12

ఇటీవలికాలంలో దేశంలోని పలు నగరాల్లో హోర్డింగ్‌లు కూలిపోయి, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని అరికట్టేందుకు, ప్రభుత్వం త్వరలో అవుట్‌డోర్ అడ్వర్టైజ్‌మెంట్ పాలసీ-2024ను తీసుకురాబోతోంది. దీని ప్రకారం రోడ్లు లేదా ఇంటి పైకప్పులపై అమర్చిన హోర్డింగ్‌లు పడిపోవడం వల్ల ఎవరైనా చనిపోతే లేదా వికలాంగులైతే ఈ ప్రకటనలు ఏర్పాటుచేసే కంపెనీలు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

ఇదేవిధంగా ఇటువంటి ప్రమాదాల్లో ఆస్తులకు నష్టం జరిగినప్పుడు కూడా అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు పరిహారం చెల్లించాలి. ఈ పరిహారం ఎంత అనేది తర్వాత నిర్ణయిస్తారు. ఇప్పటివరకూ అడ్వర్టైజింగ్ పాలసీలో ప్రమాదాల్లో పరిహారం ఇచ్చే పరిస్థితి లేదు. ఉత్తరప్రదేశ్‌లో తొలిసారిగా ఈ పాలసీని అమలుచేయనున్నారు. పట్టణాభివృద్ధి శాఖ రూపొందించిన ఈ ప్రతిపాదిత విధానానికి ఉన్నత స్థాయిలో అంగీకారం లభించింది. అవసరమైన కొన్ని సవరణలు చేసిన తర్వాత కేబినెట్‌లోనూ ఆమోదం పొందింది.

ప్రతిపాదిత విధానం ప్రకారం ఇళ్లు లేదా పైకప్పులపై హోర్డింగ్‌లు పెట్టే ముందు సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. పురపాలక సంస్థలు నగరాల్లో ఏర్పాటు చేసిన అన్ని హోర్డింగ్‌లను జియో ట్యాగింగ్ చేసి 90 రోజుల్లోగా పౌర సంస్థల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. అలాగే చట్టవిరుద్ధమైన ప్రకటనలను ఏర్పాటు చేస్తే భారీ జరిమానా విధించనున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)