Breaking News

ఆ ఆవు నెయ్యిలో నాణ్యత లేదు : పతంజలికి షాక్‌

Published on Mon, 12/01/2025 - 13:02

యోగా గురు బాబా రాందేవ్‌కు భారీ షాక్‌ తగిలింది. పతంజలి  ఆయుర్వేద లిమిటెడ్ ద్వారా విక్రయించే  ఆవు నెయ్యి (కౌ ఘీ) కల్తీదని తేలింది. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లోని ఒక కోర్టు,   పతంజలి  మరో ఇద్దరు పార్టీలపై జరిమానా విధించింది.నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించింది.

2020లో పతంజలి  ఘీ అధికారిక పరీక్షల్లో నాణ్యతా ప్రమాణాల్లో  విఫలమైంది. నాసిరకం ఆవు నెయ్యిని అమ్మినందుకు పితోర్‌గఢ్‌లోని అడ్జుడికేటింగ్ ఆఫీసర్/ADM కోర్టు అహ్మద్‌నగర్‌లోని పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌కు రూ. 1 లక్ష జరిమానా విధించింది. దీనితో పాటు, పంపిణీదారు బ్రహ్మ ఏజెన్సీలకు రూ. 25,000 ,రిటైలర్ కరణ్ జనరల్ స్టోర్‌కు రూ. 15,000 జరిమానా విధించింది.  అయితే  ఈతీర్పుపై అప్పీల్ దాఖలు చేయనుంది. ఆహార భద్రతా ట్రిబ్యునల్ ముందు అప్పీల్ దాఖలు చేస్తున్నట్లు కంపెనీ పతంజలి అధికారి  ఒకరు తెలిపారు.

ఇదీ చదవండి: మహిళా వ్యాపారవేత్తపై ఫార్మా బాస్‌ నిర్వాకం : తుపాకీతో బెదిరించి, న్యూడ్‌ వీడియోలు

ది టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం రెండు సార్లు పరీక్షల్లో  పతంజలి నెయ్యి  ఫెయిల్‌ అయింది. అక్టోబర్ 20, 2020న పితోర్‌గఢ్‌లోని కషానీలోని ఒక దుకాణం నుండి ఆహార భద్రతా అధికారి నెయ్యి నమూనాను సేకరించినప్పుడు ఈ కేసు ప్రారంభమైంది. కొనుగోలు బిల్లులో ఉత్పత్తిని బ్రహ్మ ఏజెన్సీస్, ధార్చుల రోడ్ , పతంజలి ఆయుర్వేద లిమిటెడ్, అహ్మద్‌నగర్‌లకు అనుసంధానించారు.  అప్పటి పరీక్షల్లో  ఈ నెయ్యి నాణ్యత లేనిదిగా తేలింది. తిరిగి ఈ నమూనాను మొదట రుద్రపూర్‌లోని రాష్ట్ర ఆహార , ఔషధ పరీక్ష ప్రయోగశాలకు పంపారు. అక్కడ అది నాణ్యత లేనిదిగా తేలిందని ఆహార భద్రత మరియు ఔషధ పరిపాలన అసిస్టెంట్ కమిషనర్ ఆర్‌కె శర్మ తెలిపారు.  2022 ఫిబ్రవరిలో ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం, 2006 కింద కేసు దాఖలు చేసి, పతంజలికి నోటీసు  జారీ చేసింది.  తాజా విచారణలో  గురువారం, నవంబర్ 27న, కోర్టు జరిమానాలు విధించి, ఆహార భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది.

 

Videos

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)