Breaking News

‘‘ఎడ్ల బండైనా ఎక్కుతాను.. ఎయిర్‌ ఇండియా విమానం ఎక్కను’’

Published on Tue, 06/25/2024 - 20:40

బెంగళూరు: టాటా గ్రూపునకు చెందిన ఎయిర్‌ ఇండియా విమానంలో ఎదురైన చేదు అనుభవంపై ఓ ప్రయాణికుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకెప్పుడూ ఎయిర్‌ఇండియా విమానం ఎక్కబోనని, దానికంటే ఎడ్లబండి నయం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య కొండవార్‌ అనే ఓ స్టార్టప్‌ కంపెనీ ఉద్యోగి ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు పెట్టారు. 

బెంగళూరు నుంచి పుణెకు వెళ్లడానికి ఎయిర్‌ఇండియా విమానం ఎక్కినపుడు ఎదురైన సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ‘నాకు గొప్ప గుణపాఠం చెప్పినందుకు థ్యాంక్యూ. చివరకు ఎడ్లబండి అయినా ఎక్కుతాను కానీ ఇంకెప్పుడు మీ విమానంలో ప్రయాణించను. అవసరమైతే డబుల్‌ పే చేసి టైమ్‌కి వచ్చే విమానాల్లో వెళ్తాను. 

 జూన్ 24 రాత్రి 9.50 గంటలకు టేకాఫ్ కావాల్సిన విమానం అర్ధరాత్రి 12.20 గంటలు దాటిన తర్వాత బయల్దేరింది. ఎక్కిన తర్వాత విమానం మొత్తం ఒకటే వాసన. సీట్లు చాలా మురికిగా ఉన్నాయి. వాటి నిండా మరకలే. నాకు టాటా గ్రూప్‌పై అమితమైన గౌరవం ఉంది. అలాగే వారినుంచి ఎప్పుడూ నాణ్యమైన సేవలను ఆశిస్తాను. 

కానీ నా అనుభవం​ మాత్రం భయంకరం’అని పోస్టులో తెలిపారు. ఈ పోస్టుపై ఎయిర్‌ ఇండియా స్పందించింది. ‘అసౌకర్యానికి చింతిస్తున్నాం. మా పరిధిలోలేని కారణాల వల్ల విమానం ఆలస్యమైందని దయచేసి గమనించండి. మీకు ఎదురైన సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం. ఎయిరిండియాలో ప్రయాణించొద్దనే నిర్ణయంపై పునరాలోచించండి’అని కోరింది.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)