Breaking News

పార్లమెంట్‌లో మణిపూర్ రచ్చ.. లోక్‌సభ వాయిదా.. కొనసాగుతున్న రాజ్యసభ..

Published on Fri, 07/21/2023 - 11:29

Updates.. 

► పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నేడు ఉభయ సభలు మణిపూర్ అంశంపైనే పట్టుబట్టాయి. ఇటీవల విడుదలైన వీడియోలపై స్పందించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. కానీ కేంద్రం ఎలాంటి అవకాశం ఇవ్వలేదని తెలిపారు. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సభలోపల మాట్లాడాలని డిమాండ్ చేశారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్ బయట ప్రధాని మోదీ మాట్లాడిన విషయం తెలిసిందే. 

► పార్లమెంట్‌లో మణిపూర్‌పై నిరసన నేపథ్యంలో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. 

► మణిపూర్‌ అంశంపై రాజ్యసభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా పడింది. 

► ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా పార్లమెంట్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్‌లో జరిగిన హింస మన మనస్సాక్షిని కదిలించింది. కేంద్ర ప్రభుత్వం నిద్ర నుండి మేల్కొనాలి. మణిపూర్ సమస్యపై చర్చించాలని నేను అభ్యర్థిస్తున్నాను... మణిపూర్‌లో ఏం జరుగుతుందో, ప్రభుత్వం ఏం చేసిందో దేశం మొత్తం తెలుసుకోవాలని కోరుకుంటోంది. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి.

► కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యారు. 

► ఈ క్రమంలోనే విపక్షాలు చర్చకు పట్టుబట్టగా లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడింది.

► కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. విపక్షాలకు నచ్చచెప్పే యత్నం చేసినా విపక్షాలు ఆందోళన కొనసాగాయి. దాంతో లోక్‌సభను వాయిదా వేయక తప్పలేదు మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా లోక్‌సభలో మణిపూర్‌ ఘటనపై చర్చకు అవకాశం ఇవ్వాలని విపక్షాలు మరోసారి తమ ఆందోళన కొనసాగించే అవకాశం ఉంది.

► దీనిపై ముందుగా చర్చకు అవకాశం ఇవ్వాలనేది విపక్షాల ప్రధాన డిమాండ్‌. దీనిపైనే తొలిరోజు కూడా విపక్షాలు ఆందోళన చేపట్టగా, రెండో రోజు కూడా అదే రచ్చ కొనసాగుతోంది.

ఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మణిపూర్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనపై పార్లమెంట్‌ దద్దరిల్లిపోతోంది.  

► ఈ ఘటనపై చర్చ జరగాలని విపక్షాల డిమాండ్‌తో పార్లమెంట్‌ రెండో రోజూ కూడా ఆందోళనల నడుమే ప్రారంభమైంది.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)