ఈ పార్లమెంటు సమావేశాలు.. విజయోత్సవాలు

Published on Mon, 07/21/2025 - 09:58

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలను జాతికి విజయోత్సవాలుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ‘‘బాంబులు, తుపాకులు అవి పుట్టించే హింసపై ఎప్పటికీ రాజ్యాంగ స్ఫూర్తిదే పై చేయి. మా పాలనలో పదేపదే నిరూపితమవుతూ వస్తున్న వాస్తవమిది’’ అని మోదీ చెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌తో సహా విపక్షాలు లేవనెత్తదలచిన అన్ని అంశాలపైనా చర్చకు ప్రభుత్వం సిద్ధమంటూ సంకేతాలిచ్చారు. సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో ప్రధాని మీడియాతో మాట్లాడారు. 

‘‘ఇవి దేశానికి గర్వకారణంగా నిలవనున్న సమావేశాలు. విజయో త్సవాల వంటివి. మన సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలను ప్రపంచమంతా అబ్బురపాటుతో వీక్షించింది. సైన్యం 100 శాతం కచ్చితత్వంతో లక్ష్యాలను సాధించి భారత పతాకను సమున్నతంగా ఎగురవేసింది’’ అని ఆపరేషన్‌ సిందూర్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ‘‘ఆ ఘనతను అఖిలపక్ష బృందాలు దేశదేశాల్లో చాటాయి. ఆ పార్టీలకు, ఎంపీలకు నా అభినందనలు’’అన్నారు. సిందూర్‌ వేళ మేడిన్‌ ఇండియా ఆయుధాలు అద్భుతంగా సత్తా చాటి ప్రపంచం దృష్టిని ఆకర్షించాయని గుర్తు చేశారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)