Breaking News

Parliament: ప్రతిపక్షాల నిరసనలు .. లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు వాయిదా

Published on Mon, 08/18/2025 - 10:09

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. నేడు కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే లోక్‌సభలో గందరగోళం చెలరేగింది. ప్రతిపక్ష ఎంపీలు బీహార్‌లో ఓటు చోరీ, ఎస్‌ఐఆర్‌ అంశంపై గందరగోళం సృష్టించారు. రాజ్యసభ సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. డిప్యూటీ చైర్మన్  వివిధ అంశాలపై చర్చించడానికి 267 నిబంధన కింద అందిన 19 నోటీసులను తిరస్కరించారు. ప్రతిపక్షాల నిరసనల మధ్య ఎగువ సభ వాయిదా పడింది. అదేవిధంగా ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య లోక్‌సభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది. 


దీనికి ముందు లోక్‌సభలో నినాదాలు చేస్తున్న ప్రతిపక్ష ఎంపీలతో స్పీకర్ ఓం బిర్లా ‘మీరు నినాదాలు చేసేంత తీవ్రతతో ప్రశ్నలు లేవనెత్తాలని,  అప్పుడే దేశ ప్రజలకు ప్రయోజనాలు లభిస్తాయని అన్నారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడానికి ప్రజలు మిమ్మల్ని ఇక్కడకు పంపలేదు,  ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసే అధికారం ఏ సభ్యునికీ లేదని అభ్యర్థిస్తున్నాను.. హెచ్చరిస్తున్నాను’ అని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎంపీలలో అ‍న్నారు. 

శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై ప్రత్యేక సమావేశం
ఈరోజు లోక్ సభలో మధ్యాహ్నం రెండు గంటలకు శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై ప్రత్యేక సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ చర్చను ప్రారంభించనున్నారు. అలాగే నేడు జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు- 2025 ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ దీనిని ప్రవేశపెట్టనున్నారు.

మరోవైపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌)పై చర్చ నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండటంతో వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. శుక్రవారం ప్రతిపక్ష పార్టీల నేతలు పార్లమెంటు నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు ‘ఓటు చోరీ’ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)