Breaking News

అరాచకం సృష్టించడానికి కుట్ర.. వెలుగులోకి కీలక విషయాలు

Published on Sat, 12/16/2023 - 11:04

ఢిల్లీ: లోక్‌సభలో అలజడి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనతో దేశంలో అరాచకం చెలరేపడమే నిందితుల అజెండా అని లలిత్ ఝ కస్టడీ పిటిషన్ లో పోలీసులు పేర్కొన్నారు.  దేశంలో అలజడి సృష్టించి తద్వారా తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలని నిందితులు భావించినట్లు వెల్లడించారు. ఈ దాడి వెనక నిందితులకు ఏమైనా విదేశీ, ఉగ్రవాద సంస్థల నుంచి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే  అంశంపై దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసేందుకు దేశంలో అరాచకం సృష్టించాలని భావించినట్లు కీలక సూత్రధారి లలిత్ ఝా వెల్లడించినట్లు కస్టడీ విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులు పాటియాలా కోర్టుకు తెలిపారు.  లలిత్ ఝా తన ఫోన్‌ను ఢిల్లీ-జైపూర్ సరిహద్దులో విసిరివేసినట్లు అంగీకరించాడు. ఈ కుట్ర ప్రణాళికను అమలు చేయడానికి ముందు ఢిల్లీలో అనేకమార్లు కలిసినట్లు లలిత్ ఝా చెప్పాడు. ఇతర నిందితుల ఫోన్‌లను ధ్వంసం చేసినట్లు తెలిపాడని పోలీసులు వెల్లడించారు.

 ఈ చర్య వెనక విదేశీ ప్రమేయం ఉందని దర్యాప్తు బృందం అనుమానిస్తోంది. నిందితులకు ఏదైనా శత్రు దేశంతో లేదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయా అనే విషయాన్ని నిర్ధారించేందుకు విచారించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఝా తన ఫోన్‌ను విసిరిన, ఇతర నిందితుల ఫోన్‌లను కాల్చిన ప్రదేశాలను కనుగొనడానికి పోలీసులు రాజస్థాన్‌కు తీసుకెళ్లనున్నారు. లోక్‌సభ ఛాంబర్‌లోకి నిందితులు దూకిన ఘటనను రీక్రియేట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ అనుమతిని కోరే అవకాశం ఉంది. 

ఇదీ చదవండి: ‘పార్లమెంట్‌ భద్రత.. ప్రభుత్వ బాధ్యత కాదు’

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)