Breaking News

పుత్రశోకాన్ని తట్టుకోలేక తల్లిదండ్రుల ఆత్మహాత్య

Published on Tue, 02/17/2026 - 08:36

ఛత్తీస్‌గఢ్‌లో హృదయవిధారకర ఘటన జరిగింది. తాము కంటికి రెప్పలా కాపాడి నవ మాసాలు పెంచి పెద్దచేసిన కుమారుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడని ఆ తల్లిదండ్రులిద్దరూ ఆవేదనతో తల్లడిల్లిపోయారు. ఎంత ప్రయత్నించినా ఆ దుఃఖం నుంచి బయిటకీ రాలేకపోయారు. కుమారున్నే తలచుకుంటూ నిద్రలేని రాత్రులు గడిపారు. పుత్ర శోకం నుంచి బయిటికి రాలేక భార్యభర్తలిద్దరూ తనువు చాలించారు.

జంజీర్ చంఫా జిల్లాకు చెందిన కృష్ణా, రమాబాయిలకు ఒకే కుమారుడు  అతని పేరు ఆదిత్యపటేల్. 2024లో ఆదిత్యా దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో అప్పటి నుంచి ఆయన తల్లిదండ్రులు డిఫ్రెషన్‌లోకి వెళ్లారు. ఎంత ప్రయత్నించినా కుమారుడిని మరిచి పోలేకపోవడంతో భార్యభర్తలిద్దరూ తనువు చాలిద్దామని నిర్ణయించుకున్నారు. దీంతో సూసైడ్‌ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

చివరిసారిగా వారు లేఖలో "మా జీవీతం. మా పునాది, మా ప్రపంచం, అతనే మా కేర్ టేకర్ నా మిత్రుడు. ఆ రోజు బయిటకి వెళ్లనని తన కుమారుడు చెబితే తానే బలవంతంగా పంపాను అదే నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు" అని లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత అతను ప్రపంచాన్నే వదిలాడు. మేము జీవిస్తున్నాం కానీ నిజానికి అలా లేదు అని లేఖలో రాసి  తమ ఇంటి  పెరడిలో భార్య భర్తలిద్దరూ ఉరి వేసుకొని మరణించారు.

 ఇంతకాలం బాధతో రగిలిపోయిన తన హృదయం ఇప్పుడు ప్రశాంతత వైపు వెలుతుందని దేవుడు చాలా దయగలవారని ఆయన లేఖలో పేర్కొన్నారు. ‍అయితే తన కుమారుడి ప్రమాదానికి వచ్చే పరిహారం దయచేసి తన సోదరుడికి అందజేయాలని లేఖలో పేర్కొన్నారు. వారిద్దరి మరణంతో ఈ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్‌మార్డం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

#

Tags : 1

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు