Breaking News

‘పప్పా.. నేను అజిత్‌ పవార్‌తో వెళ్తున్నాను’.. పింకీ మాలి చివరి మాటలు ఇవే..!

Published on Wed, 01/28/2026 - 21:30

ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అజిత్‌ పవార్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటనకు ముందు విమాన సిబ్బంది పింకీ మాలి తన తండ్రి శివకుమార్ మాలికి చేసిన చివరి ఫోన్ కాల్ ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.  

ముంబైలోని వర్లీ ప్రాంతానికి చెందిన పింకీ..ప్రయాణానికి ముందు తన తండ్రితో మాట్లాడుతూ, ‘పప్పా, నేను అజిత్ పవార్‌తో బారామతి వెళ్తున్నాను. ఆయనను అక్కడ దింపిన తర్వాత నేను నాందేడ్‌కి వెళ్తాను. మనం రేపు మాట్లాడుకుందాం’ అని చెప్పింది. ఆ మాటలు ఆమె తండ్రికి చివరి జ్ఞాపకంగా మిగిలిపోయాయి.

పింకీ మాలీ మరణంపై ఆమె తండ్రి శివకుమార్ మాలి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నా కూతురు ఫోన్‌ చేస్తే మాట్లాడాను. చివరిగా.. ‘రేపు నీ పని అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం’ అని అన్నాను. కానీ ఆ రేపు ఎప్పటికీ రాలేదు. తన కూతురు ఇక లేరని తెలుసుకున్న తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు.

ఆయన మాట్లాడుతూ..‘నేను ఆమెతో రేపు మాట్లాడతానని అనుకున్నాను. కానీ ఆ రేపు ఎప్పటికీ రాదు. నా కూతురు నాకు దూరమైపోయింది. ఆమె ఇటీవల అజిత్ పవార్‌తో అనేక ప్రయాణాల్లో పాల్గొనేది. నాకు ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలియదు. నాకు టెక్నికల్ విషయాలపై అవగాహన లేదు. నేను పూర్తిగా కుంగిపోయాను. నాకు కావలసింది ఒక్కటే. నా కూతురి భౌతిక కాయం. గౌరవ ప్రదంగా అంత్యక్రియలు చేయడానికి మాత్రమే నేను కోరుకుంటున్నాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మాటలు ఒక తండ్రి హృదయవేదనను, ఒక కుటుంబం ఎదుర్కొంటున్న విషాదాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పింకీ మాలి చివరి మాటలు ఇప్పుడు వారి కుటుంబానికి శాశ్వత జ్ఞాపకంగా మిగిలిపోయాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)