Breaking News

‘పంచాయతీ చట్టాలు అన్ని రాష్ట్రాల్లో ఒకే రకంగా ఉండాలి’

Published on Sun, 12/21/2025 - 16:50

అఖిల భారత పంచాయత్ పరిషత్‌ 18 వ జాతీయ మహాసభల్లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో గదగ్ మహాత్మా గాంధీ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ డెవలప్మెంట్ యూనివర్సిటీ లో జరిగిన సభలో అఖిల భారత పంచాయతీ పరిషత్‌ జనరల్ సెక్రటరీ,  ఆంధ్ర ప్రదేశ్ AIPP అధ్యక్షులు M. చిదంబర రెడ్డి ప్రసంగిస్తూ...స్థానిక సంస్థల అవశ్యకతను, సర్పంచుల విధులు, నిధులు, విడుదల పై చర్చించి 2011 సెన్సెస్ ప్రకారం కేంద్ర నిధులు గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తున్నారని, అప్పటి జనాభా అవసరాలకు, ఇప్పుటి 2025. జనాభా అవసరాలకు సరిపడా సదుపాయాలకు 4 రెట్లు పెరిగినది కావున గ్రాంట్ 4 రెట్లు పెంచవలసిన అవసరం ఉందని, ఇండియా 1 అని నాయకులు మాటలు చెప్తున్నారని, దేశం అంతా పంచాయతీ చట్టాలు ఒకే రకంగా ఉండాలని, అయితే ఒకో రాష్ట్రం లో ఒక విధంగా అమలు చేస్తున్నారని, కేరళ రాష్ట్రంలో మాత్రమే సర్పంచుల విధులు చాలా బాగున్నాయని, గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉద్యోగులు, వారి జీతాలు, పని తీరు సర్పంచుల ఆదేశాలు మేరకే జరుగుతాయని.గ్రామాలకు MLA,MP నిధులు వినియోగించాలి అంటే గ్రామ సభ, సర్వ సభ్య సమావేశం లో పంచాయతీ రిజల్యూషన్ ద్వారా అధికారులు నడుచుకుంటారు.

స్థానిక సంస్థలలో (సర్పంచి /ఎంపిటిసి/కౌన్సిలర్/జడ్పీటీసీ/కార్పొరేటర్  స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు కనీస విద్యార్థత ఉండేలా చట్టం తేవాలని, గౌరవ వేతనం దేశం మొత్తం ఒకే విధంగా ఉండాలని,MLA,MP,MLC లకు పింఛను రిటైర్డ్ అయినాక స్థానిక సంస్థల ప్రతినిధులకు ఇచ్చే చట్ట సవరణ చేయాలని , గత ప్రభుత్వం లో  మాజీ ముఖ్యమంత్రి గౌ.శ్రీ.YS జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో సచివాలయం, హాస్పిటల్, రైతు భరోసా,గ్రంథాలయం, డైరీ ల సముదాయాలు ఏర్పాటు చేసి దాదాపు ప్రతి గ్రామంలో 11 నుంచి 13 మంది ఉద్యోగులు పని చేసేలా చేశారు. ప్రతి రోజూ ఈ సముదాయాలకు వందల సంఖ్యలో ప్రజలు తమ అవసర నిమిత్తం వందలాదిగా వచ్చేవారు. ప్రభుత్వం మార్పు వల్ల, ఇప్పటి ప్రభుత్వo ఉద్యోగులను కుదించి మరీ అన్యాయంగా ఒకరో, ఇద్దరో వస్తున్నారు. ప్రజలకు చాలా ఇబ్బంది ఉంటుందని, ఉద్యోగులను నియామకం చేయాలని. పై విషయాల పై కమిటీ చర్చించి.. కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రి గారి దృష్టి కి మరియు ప్రధాన మంత్రి గారిని మనం కలవాల్సిన అవసరం ఉందని అఖిల భారత పంచాయత్ పరిషద్ అధ్యక్షులు, మాజీ యూనియన్ మినిస్టర్ శ్రీ సుభోద్ కాంత్ సహాయి గారిని కోరగా.. సభలో అందరూ సహకారం అందిస్తామని చెప్పారు
 

#

Tags : 1

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)