Breaking News

సరిహద్దు దాటి భారత్‌లో అడుగుపెట్టిన పాకిస్థా‌నీ.. దొరికేశాడు..

Published on Sat, 06/13/2026 - 16:22

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో సిమ్రీ గ్రామం సమీపంలో ఓ పాకిస్థాన్‌ పౌరుడిని అధికారులు పట్టుకున్నారు. భద్రతా పరంగా దీన్ని భారీ విజయంగా చెప్పుకోవచ్చు. భారత సైన్యం చినార్‌ వారియర్స్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసులు కలిసి నిర్వహించిన ‘ఆపరేషన్‌ సిమ్రీ’ ఫలితంగా అతడు దొరికాడు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ పాకిస్థాన్‌ పౌరుడు అనుమానాస్పదంగా నియంత్రణ రేఖను దాటాడు. నిర్దిష్ట నిఘా సమాచార ఆధారంగా అప్రమత్తమైన చినార్‌ వారియర్స్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసుల సంయుక్త బృందం ఆ వ్యక్తిని అడ్డుకుని, భద్రతా ఉల్లంఘన జరిగే అవకాశాన్ని నివారించింది.

"నిర్దిష్ట నిఘా సమాచార ఆధారంగా, అప్రమత్తంగా ఉన్న చినార్‌ వారియర్స్‌ జమ్మూ కశ్మీర్‌ పోలీసులతో కలిసి జూన్‌ 12న కుప్వారాలోని సిమ్రీ గ్రామం సమీపంలో అనుమానాస్పద పరిస్థితుల్లో నియంత్రణ రేఖ దాటిన ఓ పాక్‌ పౌరుడిని పట్టుకున్నారు. వేగంగా స్పందించిన చినార్‌ వారియర్స్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసుల సంయుక్త బృందం ఆ వ్యక్తిని అడ్డుకుని, భద్రతా ఉల్లంఘన జరిగే ప‍్రమాదాన్ని నివారించింది. చొరబాటుదారుడిపై ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది" అని చినార్‌ కార్ప్స్‌ ఎక్స్‌ ద్వారా పోస్టు చేసింది.

నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) అంటే భారత్‌, పాకిస్థాన్‌ అధీన ప్రాంతాల మధ్య ఉన్న సైనిక విభజన రేఖ. ఈ ప్రాంతం చాలా కీలకం. ఉగ్రవాదులు చొరబడకుండా సైనికులు నిరంతరం పనిచేయాల్సి ఉంటుంది.  

#

Tags : 1

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు