Breaking News

పాక్ ఎత్తుగడ.. భారత్ ఎలా చిత్తు చేస్తోందంటే?

Published on Tue, 01/06/2026 - 21:40

పాకిస్థాన్ నిఘా సంస్థ.. ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ భారత్‌లోని సైనిక రహస్యాల సేకరణకు బాలలతో గూఢచర్యానికి పాల్పడుతోందా? బాలలతో రహస్యాల సేకరణ అత్యంత సులభమైన పనేనని భావిస్తోందా? ఈ ప్రశ్నలకు పంజాబ్ పోలీసులు అవుననే సమాధానం చెబుతున్నారు. అసలు పాక్ ఎత్తుగడ ఏంటి? దాన్ని భారత్ ఎలా చిత్తుచేస్తోంది? ఈ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

భారతదేశ రహస్యాల కోసం పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఇక్కడి బాలలతో గూఢచర్యం చేయిస్తోందనే విషయం బహిర్గతం కావడంతో.. మన బలగాలు ఉలిక్కి పడ్డాయి. తాజాగా పంజాబ్ పోలీసులు 15 ఏళ్ల వయసున్న ఓ బాలుడిని గూఢచర్య అభియోగాలపై అరెస్టు చేశారు. దాంతో.. ఆ బాలుడు ఏడాది కాలంగా పాకిస్థాన్‌కు సమాచారం అందజేస్తున్నాడనే విషయం వెలుగులోకి వచ్చింది. జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాకు చెందిన సదరు బాలుడి మొబైల్ ఫోన్‌ను విశ్లేషించిన దర్యాప్తు అధికారులు విస్తుపోయే విషయాలను గుర్తించారు. మిలటరీ ఎస్టాబ్లిష్‌మెంట్ల వద్దకు ఆ బాలుడు ఎలా వెళ్లాడు? ఏయే సమాచారాన్ని సేకరించి, పాకిస్థాన్‌కు పంపాడు? అనే వివరాలను అధికారులు గుర్తించారు.

తదుపరి దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయని పఠాన్‌కోట్ ఎస్పీ దల్జిందర్ సింగ్ దిలాన్ చెబుతున్నారు. ఆ బాలుడు అంబాలా వైమానిక బేస్ వద్ద పనులు నిర్వహిస్తున్న సునీల్ కుమార్ అనే కాంట్రాక్టర్ కూడా ఇదే పని చేస్తున్నట్లు చెప్పడంతో.. పోలీసులు అతణ్ని కూడా అరెస్టు చేశారు. అయితే.. జమ్మూకశ్మీర్, పంజాబ్‌లలో పలువురు బాలలతో పాకిస్థాన్ గూఢచర్యం చేయిస్తోందనే విషయం వెలుగులోకి వచ్చిందని, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

జమ్మూకశ్మీర్, పంజాబ్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. పాకిస్థాన్ ఐఎస్ఐ వర్గాలు యువతుల పేరుతో సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించి.. ఇక్కడి బాలలను హనీట్రాప్ చేస్తున్నట్లు తేలిందని చెబుతున్నారు. మైనర్ బాలురతో గూఢచర్యం చేయిస్తే.. ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో ఈ దారుణానికి ఐఎస్ఐ ఒడిగట్టి ఉంటుందని భావిస్తున్నారు. తదుపరి దర్యాప్తులో.. మరింత మంది మైనర్ల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)