Breaking News

రక్షణ సైట్లపై పాక్‌ సైబర్‌ దాడులు 

Published on Tue, 05/06/2025 - 05:50

శ్రీనగర్‌: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రతీకార చర్యలపై ఆగ్రహంతో ఉన్న పాకిస్తాన్‌ తన సైబర్‌మూకలను రంగంలోకి దింపింది. దీంతో భారత రక్షణ రంగానికి సంబంధించిన వెబ్‌సైట్లపై పాక్‌ సైబర్‌ దాడుల ఉధృతి ఎక్కువైంది. అయితే రక్షణరంగంలోని వ్యక్తుల లాగిన్, పాస్‌వర్డ్‌ వంటి క్రెడెన్షియల్స్‌ తస్కరణకు గురయినట్లు భావిస్తున్నట్లు భారత సైన్యం తాజాగా ప్రకటించింది. 

ఇండియన్‌ ఆర్మీ సోమవారం తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్‌’లో ‘పాకిస్తాన్‌ సైబర్‌ ఫోర్స్‌’ పేరిట ఈ వివరాలతో ఒక పోస్ట్‌ పెట్టింది. మిలటరీ ఇంజనీర్‌ సర్వీసెస్, ది మనోహర్‌ పారికర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టడీస్‌ అండ్‌ అనాలసిస్‌ సంస్థల సిబ్బందికి చెందిన లాగిన్, పాస్‌వర్డ్‌లను పాక్‌ సైబర్‌ నేరగాళ్లు తమ వశంచేసుకున్నారు. రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆర్మర్డ్‌ వెహికల్‌ నిగమ్‌ లిమిటెడ్‌ అధికారిక వెబ్‌సైట్‌ను హ్యాకర్లు హ్యాక్‌చేశారు.

 వెబ్‌సైట్‌ హోం పేజీపై పాకిస్తాన్‌ జెండా, అల్‌ ఖలీద్‌ యుద్ధట్యాంక్‌ ఫొటోలను పెట్టారు. ‘‘ ఈ వెబ్‌సైట్‌ ఇప్పుడు పాకిస్తాన్‌ వశమైంది. ఇది పాకిస్తాన్‌ సైబర్‌ఫోర్స్‌ పని. పహల్గాం కేవలం ఆరంభం మాత్రమే’’ అని సందేశాన్ని హ్యాకర్లు ఆ వెబ్‌సైట్‌లో పెట్టారు. దీంతో ముందుజాగ్రత్తగా భారత ఆర్మీ అధికారులు ఈ వెబ్‌సైట్‌ను ఆఫ్‌లైన్‌లో పెట్టేశారు. హ్యాకింగ్‌ కారణంగా వెబ్‌సైట్‌లోని సమాచారం ఏ స్థాయిలో చోరీకి గురైందన్న అంశాలపై విస్తృతస్థాయిలో ఆడిట్‌ చేశాకే వెబ్‌సైట్‌ను ఆన్‌లైన్‌లోకి తీసుకురానున్నారు.  
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)