Breaking News

అప్పటివరకు భారత్‌తో మాటల్లేవ్.. పాక్ విదేశాంగ మంత్రి తలపొగరు..

Published on Fri, 05/05/2023 - 19:38

న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఇరు దేశాల సంబంధాలపై బింకాలకు పోయారు. ఆర్టికల్ 370 రద్దును సమీక్షిస్తేనే భారత్‌తో సంబంధాలు, చర్చల విషయంపై ఆలోచిస్తామని అన్నారు. అప్పటివరకు భారత్‌తో ఎలాంటి సంప్రదింపులు ఉండవన్నారు. ఓ జాతీయ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యా ఖ్యలు చేశారు.

గోవాలో మే 4,5 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగిన షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సదస్సుకు భుట్టో హాజరయ్యారు. అయితే భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌తో ఎలాంటి మాటామంతీలో పాల్గొనలేదు. దీంతో భారత్‌తో ఎప్పుడు సమావేశంలో పాల్గొంటారని ప్రశ్నించగా.. ఆర్టికల్ 370 రద్దును సమీక్షించినప్పుడే అని బదులిచ్చారు.

కాగా.. 2011 తర్వాత పాకిస్థాన్ విదేశాంగ మంత్రి భారత్‌కు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అప్పుడు పాక్ విదేశాంగ మంత్రిగా ఉన్న హీనా రబ్బానీ ఖార్‌ అప్పటి భారత విదేశాంగమంత్రితో సమావేశమయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇరుదేశాల విదేశాంగ మంత్రులు ఏ సమావేశంలోనూ పాల్గొనలేదు.

జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పలు అంతర్జాతీయ వేదికలపైనా భారత అంతర్గత విషయమైన కశ్మీర్  అంశాన్ని లేవనెత్తి అబాసుపాలైంది.
చదవండి: వీడియో: రష్యా ప్రతినిధి కవ్వింపు.. ఉక్రెయిన్‌ ఎంపీ పంచ్‌ల వర్షం

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)