Breaking News

కశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలం

Published on Tue, 07/23/2024 - 08:02

జమ్ముకశ్మీర్‌లోని బట్టాల్ సెక్టార్‌లోకి చొరబడేందుకు పాక్‌ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భారత ఆర్మీ సిబ్బంది భగ్నం చేసింది. ఈ సందర్భంగా ఓ జవాను తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

ఘటన జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగమంచు నెలకొన్న కారణంగా విజిబులిటీ సున్నాగా ఉంది. అటువంటి పరిస్థితిలోనూ ఇండియన్‌ ఆర్మీ ఎంతో సమర్థవంతంగా సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తోంది. జమ్ము ప్రాంతంలో ఇటీవలి కాలంలో  ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. భారత ఆర్మీ ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల చర్యలను తిప్పికొడుతూనే ఉంది. ఈ క్రమంలో ఈరోజు(మంగళవారం) మరోసారి బట్టాల్ ప్రాంతంలో  పాక్‌ ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారు.

తెల్లవారుజామున మూడు గంటలకు ఆర్మీ బృందం ఈ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కొందరు పాక్‌ ఉగ్రవాదులు అర్థరాత్రి నుంచి కశ్మీర్‌లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్రమత్తమైన భారత ఆర్మీ దళాలు ఉగ్రవాదుల చొరబాటుయత్నాలను భగ్నం చేశాయి.ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ నేపధ్యంలో ఒక సైనికుడు గాయపడ్డారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)