Breaking News

ఢిల్లీలో హై అలర్ట్‌.. ‘26-26’ ఉగ్రదాడులకు ప్లాన్‌

Published on Wed, 01/21/2026 - 17:18

ఢిల్లీ: దేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రవాద సంస్థలు దాడులకు ప్లాన్‌ చేస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి.  దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ‘26-26’ అనే కోడ్‌ నేమ్‌ను పెట్టుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో, ఢిల్లీ, కశ్మీర్‌, బోర్డర్‌లో భద్రతా బలగాలు హై అలర్ట్‌ అయ్యాయి. ఈ క్రమంలో పలువురు అనుమానితుల ఫొటోలతో ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు.

నిఘా వర్గాలు తెలిపిన వివరాల మేరకు.. దాయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ (JeM) భారత్‌లో ఉగ్రదాడులకు ప్లాన్‌ చేసింది. గణతంత్ర దినోత్సవాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో జనవరి 26న భీకర దాడులకు పాల్పడేందుకు ‘26-26’ అనే కోడ్‌ నేమ్‌ను పెట్టుకున్నారు. పాక్‌కు చెందిన నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ISI) ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్టు తెలిసింది. గణతంత్ర వేడుకలకు అంతరాయం కలిగించాలనే ఉద్దేశంతో దాడులకు ప్లాన్‌ చేసుకున్నారు అని తెలిపాయి. దీంతో, అలర్ట్‌ అయిన భద్రతా బలగాలు..  జమ్ము కశ్మీర్‌, ఢిల్లీ, పంజాబ్‌ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.

ఇదే సమయంలో పలువురు అనుమానితుల ఫొటోలతో ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. వారిని ఎక్కడైనా గుర్తిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు. నిందితులు సామాజిక మాధ్యమాలలో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ.. జమ్మూ కశ్మీర్‌, పంజాబ్‌, దిల్లీ, హరియాణాలోని యువకులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నట్లు  గుర్తించినట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

పోలీసుల మాక్ డ్రిల్స్
ఉగ్ర ముప్పు నేపథ్యంలో ఉత్తర ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అత్యంత రద్దీగా ఉండే, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా సంసిద్ధతను అంచనా వేయడానికి నాలుగు ప్రధాన మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఎర్రకోట, ISBT కాశ్మీరీ గేట్, చాందినీ చౌక్, ఖారీ బావోలీ, సదర్ బజార్, మెట్రో స్టేషన్లు వంటి ప్రదేశాల్లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలను బలోపేతం చేయడం, అత్యవసర సమయంలో ప్రజలు, ఏజెన్సీలు ఎలా స్పందించాలో అవగాహన కల్పించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)