Breaking News

చిత్రకారునికి కొత్త చేతులు.. ఢిల్లీ వైద్యుల అద్భుతం!

Published on Thu, 03/07/2024 - 07:51

ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయిన ఒక చిత్రకారుడు ఇప్పుడు తన కొత్త చేతులతో బ్రష్‌ పట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఢిల్లీకి చెందిన వైద్యుల బృందం చేసిన ఈ సర్జికల్ ఎక్సలెన్స్ ను అందరూ కొనియాడుతున్నారు. 

అవయవ దానంతో తన శరీరం నలుగురికి ఉపయోగపడాలని తపనపడిన ఒక మహిళ కలను ఆ వైద్యుల బృందం సాకారం చేసింది. ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ వైద్యులు 45 ఏళ్ల వ్యక్తికి ద్వైపాక్షిక చేతి మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించారు.. బాధితుడు 2020లో రైలు ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయాడు. దీంతో అతను ఏ పనీ చేయలేక నిరాశగా కాలం వెళ్లదీస్తున్నాడు. అయితే బ్రెయిడ్‌ డెడ్‌కు గురైన ఒక మహిళ అతనికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది.

బ్రెయిన్ డెడ్‌కు చేరిన దక్షిణ ఢిల్లీలోని ఒక పాఠశాల మాజీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ మీనా మెహతా తన మరణానంతరం అవయవ దానానికి గతంలోనే సమ్మతి తెలిపారు. దీంతో ఆమె శరీరంలోని కిడ్నీ, కాలేయం, కార్నియా ముగ్గురికి కొత్త జీవితాన్ని ప్రసాదించాయి. ప్రమాదంలో చేతులు పోగొట్టుకుని నిస్సహాయంగా బతుకీడుస్తున్న ఒక చిత్రకారుని కుంచె ఇప్పుడు తరిగి అద్భుతాలను చేసేందుకు సిద్ధం అయ్యింది. 

ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన వైద్యుల బృందానికి విశేష ప్రశంసలు అందుతున్నాయి. ఈ శస్త్రచికిత్స చేయడానికి వైద్యులకు 12 గంటలకుపైగా సమయం పట్టింది. ఎట్టకేలకు వైద్యుల కృషి ఫలించింది.  ఆ వైద్యుల బృందం చిత్రకారునితో ఒక ఫోటోను క్లిక్ చేసింది. పెయింటర్‌ విజయోత్సాహంతో తన రెండు చేతులను పైకి ఎత్తడాన్ని ఆ ఫొటోలో మనం చూడవచ్చు. 

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)