Breaking News

వీడియో: హచికో గుర్తుందా..? అలాంటి విశ్వాసమే ఇది! కానీ..

Published on Tue, 01/27/2026 - 12:37

హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన.. హచికో కథను గుర్తు చేసింది.. తన యజమాని మరణించిన తర్వాత కూడా.. దాదాపు పదేళ్లు ప్రతిరోజూ షిబుయా రైల్వే స్టేషన్ వద్ద అతని కోసం ఎదురుచూసిన హచికో కథ జపాన్ అంతటా, తరువాత ప్రపంచవ్యాప్తంగా నిబద్ధత, విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. హచికో కథ ఆధారంగా Hachi: A Dog’s Tale(2009) అనే హాలీవుడ్ సినిమా రూపొందించారు. అలాగే 777 చార్లీ.. ఆ చిత్రంలో  పెంపుడు కుక్కతో ఓ వ్యక్తికి ఉన్న అనుబంధాన్ని ఎంత గొప్పగా చూపించారో తెలిసిందే.

మనుషులు, జంతువులకు మధ్య ఉండే విడదీయలేని బంధానికి నిదర్శనంగా నిలిచిన ఘటన.. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లా భర్మౌర్‌లో వెలుగులోకి వచ్చింది. బయట అడుగుపెట్టడానికే మనుషులు భయపడేంతటి గడ్డకట్టే చలిలో.. భారీ మంచు కురుస్తున్నా.. తన చనిపోయిన యజమాని వెంటే నాలుగు రోజుల పాటు ఉండిపోయింది ఓ పిట్‌బుల్ శునకం..

భర్మౌర్‌లోని భర్మణి ఆలయం సమీపంలో యువకులు విక్షిత్ రానా, పియూష్ అదృశ్యమయ్యారు. ప్రతికూల వాతావరణం కారణంగా వారు మంచులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజుల తర్వాత సహాయక బృందాలు, స్థానిక గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు అక్కడ కనిపించిన దృశ్యం అందరినీ కన్నీరు పెట్టించింది. పియూష్ మృతదేహం మంచు పొరల కింద కూరుకుపోయి ఉండగా, అతని పెంపుడు కుక్క మాత్రం అతని పక్కనే కూర్చుని ఉంది.

 ఆ నాలుగు రోజుల పాటు ఆహారం ముట్టని ఆ మూగజీవి.. కనీసం ఆ ప్రదేశం నుంచి కూడా కదల్లేదు. గడ్డకట్టే గాలులను, మంచు తుఫానును తట్టుకుంటూ.. తన యజమాని మృతదేహాన్ని అడవి జంతువుల బారి నుంచి కాపలా కాసింది. రెస్క్యూ బృందం మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నించినప్పుడు.. ఆ కుక్క మొదట దూకుడుగా ప్రవర్తించింది. గుర్తు తెలియని వ్యక్తులు తన యజమానికి హాని చేయడానికి వచ్చారమోనని భావించింది. చివరకు సహాయక బృందం ఎంతో ఓపికతో ఆ కుక్కను శాంతింపజేసి, తాము సహాయం చేయడానికే వచ్చామని నమ్మించడంతో ఆ శునకం వెనక్కి తగ్గింది. జంతువుల ప్రేమ, విశ్వాసం మరణం తర్వాత కూడా నిలిచి ఉంటాయని ఈ ఘటన నిరూపించింది.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)