‘మైక్ ఆగిపోతే అది..’.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!

Published on Mon, 07/20/2026 - 11:05

సహారన్‌పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై, విపక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో మైక్ తరచూ ఆగిపోవడంతో, సౌండ్ ఆపరేటర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.

సౌండ్ సిస్టమ్ నిర్వహించే వ్యక్తి బీజేపీకి ‘బీ’ టీమ్ అని, సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుదారుడని ఆయన చమత్కరించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, గొంతు నొక్కాలని చూసినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఒవైసీ అన్నారు. సంభల్ వివాదం, అయోధ్య వ్యవహారాలు, మసీదులు, రాంపూర్ జోహార్ విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఒవైసీ తీవ్రంగా తప్పుబట్టారు. కేవలం ఓటు బ్యాంకుగా ముస్లింలను వాడుకుంటున్నారే తప్ప, వారికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో విపక్షాలు విఫలమయ్యాయని ఆరోపించారు.

రాష్ట్రంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని, పేపర్ లీక్ ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతున్నాయని విమర్శించారు. భాగస్వామ్య రాజకీయాల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్న ఆయన, బీజేపీని ఓడించేందుకు ఎన్నికలకు ముందే పొత్తులకు సిద్ధమని ప్రకటించారు. ముస్లింలు తమ స్వంత రాజకీయ నాయకత్వాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)