Breaking News

ఐజీఐఏలో సాంకేతిక లోపం.. 100కు పైగా విమానాలు ఆలస్యం

Published on Fri, 11/07/2025 - 10:03

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐఏ)లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో శుక్రవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో 100 కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని విమానయాన సంస్థలు తెలిపాయి. ‘ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)వ్యవస్థలో సాంకేతిక సమస్యల కారణంగా, ఐజీఐఏలో విమానయాన కార్యకలాపాలు ఆలస్యం అవుతున్నాయి. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు సాంకేతిక సిబ్బంది వారి భాగస్వాములతో చురుకుగా పనిచేస్తున్నారు. తాజా  అప్‌డేట్‌ల కోసం కోసం ప్రయాణికులు తమ విమానయాన సంస్థలతో  టచ్‌లో ఉండాలని సూచించాయి.

 


ఢిల్లీ విమానాశ్రయంలో ప్రతిరోజూ 1,500కు పైగా విమానాల రాకపోకలు కొనసాగుతుంటాయి. తాజాగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో  ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు వాటికవే విమాన ప్రణాళికలను నిర్వహించలేకపోతున్నాయి. ఆటో ట్రాక్ సిస్టమ్ (ఏఎంఎస్‌)కు సమాచారాన్ని అందించే ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (ఎఎంఎస్‌ఎస్‌)లో కొన్ని సమస్యలు తలెత్తాయి. ఇది విమానయాన ప్రణాళికలను అందిస్తుందని  విమాన సంస్థలు పీటీఐకి తెలిపాయి. సిస్టమ్ సమస్యలు కొనసాగుతున్నందున, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు అందుబాటులో ఉన్న డేటాతో విమాన ప్రణాళికలను మాన్యువల్‌గా సిద్ధం చేస్తున్నారు. ఇది కొంతమేరకు సమయం తీసుకునే ప్రక్రియ  కావడంతో పలు విమానాలు ఆలస్యం అవుతున్నాయి.

‘ఎయిర్ ఇండియా’ తన  ప్రయాణికులకు సలహా జారీ చేస్తూ  ‘ఢిల్లీలోని ఏటీసీ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య .. అన్ని విమానయాన సంస్థల విమాన కార్యకలాపాలను ప్రభావితం చేస్తోంది. ఫలితంగా విమానాల రాకపోకల్లో ఆలస్యం జరుగుతుందని’ తెలియజేసింది. ఇదేవిధంగా విమానయాన సంస్థలు ‘ ఇండిగో’, ‘స్పైస్‌జెట్’లు కూడా తమ ప్రయాణికులకు సలహా జారీ చేశాయి.

 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)