Breaking News

అమెరికాలో భారతీయులకు కొత్త టెన్షన్‌.. సంచలనంగా మారిన నివేదిక!

Published on Sun, 04/20/2025 - 11:47

అగ్రరాజ్యం అమెరికా అంటేనే విదేశీయులకు భయం పుడుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక, భారతీయుల దుస్థితి మాత్రం మరింత దారుణంగా ఉంది. భారతీయుల వీసాలే ఎక్కువ సంఖ్యలో రద్దు అవుతున్నాయి. అమెరికా ప్రభుత్వం రద్దు చేసిన వీసాల్లో 50 శాతం భారతీయ విద్యార్థులవేనని తేలింది. వీసా రద్దు అంటూ భారతీయులకు మెయిల్స్‌ వస్తున్నాయి.

అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌కు అందిన నివేదికల ప్రకారం ప్రభుత్వం రద్దు చేసిన 327 వీసాల్లో 50శాతం భారతీయులు ఉన్నారని.. అయితే వారి వీసా రద్దుకు సరైన కారణాలు పేర్కొనలేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటువంటి చర్యల వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.

ఇక, విద్యార్థులు అక్కడే చదువుకున్నారు. చాలా ఏళ్లుగా అమెరికాలోనే ఓపీటీపై ఉద్యోగాలు చేస్తున్నారు. ఓపీటీ అంటే ఆప్షనల్‌ ప్రాక్టీకల్‌ ట్రైయినింగ్‌. దీని ప్రకారం అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయవచ్చు. ఇలా ఉద్యోగం చేస్తున్న వారి వీసాలే ఇప్పుడు అమెరికాలో ఎక్కువగా రద్దు అవుతున్నాయి. అయితే, ఈ వీసాల రద్దుకు మాత్రం కారణాలు స్పష్టం చెప్పడం లేదు. ఒక్క మెయిల్‌తో వీసాలను రద్దు చేస్తున్నారు. దీంతో, భారతీయులు గందరగోళం నెలకొంది.

నివేదిక ప్రకారం.. వీసాలు రద్దు చేసిన విద్యార్థుల్లో 50శాతం మంది భారత్‌కు చెందినవారు కాగా 14శాతం మంది చైనా దేశీయులు. తర్వాతి స్థానాల్లో దక్షిణ కొరియా, నేపాల్‌, బంగ్లాదేశ్ విద్యార్థులు ఉన్నారు. దీనిపై ఇమిగ్రేషన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ మాట్లాడుతూ.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ (DOS), ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొంది. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇక, చట్టబద్దమైన పత్రాలు లేని విద్యార్థులను దేశం నుంచి బహిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే.

మరిన్ని విషయాలు ఈ వీడియోలో.. 


 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)