ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహాత్మా గాంధీ బంధువు?

Published on Tue, 08/19/2025 - 11:40

న్యూఢిల్లీ: దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల వేడి నెలకొంది. త్వరలో జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాల  ఇండియా కూటమి రాజకీయేతర, పార్టీయేతర అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కోవలో పలువురు ప్రముఖుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ జాబితాలో ఒక శాస్త్రవేత్త, మహాత్మా గాంధీ వారసుడు కూడా ఉన్నారు. వీరిలో ఇస్రో మాజీ శాస్త్రవేత్త ఎం. అన్నాదురై పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. భారతదేశ చంద్రయాన్, మంగళయాన్ మిషన్లలో అన్నాదురై కీలక పాత్ర పోషించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, మహాత్మా గాంధీ ముని మునిమనవడు తుషార్ గాంధీని కూడా ఉప రాష్ట్రపదవికి నామినేట్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

రాజకీయేతర వ్యక్తికి మద్దతు ఇవ్వడం ద్వారా, పార్టీ శ్రేణులకు అతీతంగా, విస్తృత ఆమోదం పొందే అవకాశం ఉంటుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. సెప్టెంబర్ 9న జరగనున్న  ఉపరాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థిని నిర్ణయించేందుకు ప్రతిపక్ష పార్టీలు ఈరోజు(మంగళవారం) మధ్యాహ్నం 12.30 గంటలకు న్యూఢిల్లీలోని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో సమావేశం కానున్నారు. ఈ సమావేశం అనంతరం ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
 

Videos

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)