అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
OP shield: పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్
Published on Sat, 05/31/2025 - 10:47
న్యూఢిల్లీ, సాక్షి: పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో ఇవాళ ఆపరేషన్ షీల్డ్(Operation Shield) నిర్వహించారు. జమ్ము, పంజాబ్, రాజస్థాన్, హర్యానాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఎయిర్రైడ్ సైరన్ డ్రిల్ నిర్వహించారు. మొత్తం 244 జిల్లాల్లో సాయంత్రం 5గం. నుంచి 9గం. దాకా మాక్ డ్రిల్స్ నిర్వహించింది.
యుద్ధంలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలోని భద్రతా బలగాలు ఎలా వ్యవహరించాలి, మరీ ముఖ్యంగా పౌర రక్షణ నేపథ్యంతో ఈ మాక్ డ్రిల్స్ జరిపారు. ఈ నెలలో.. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) కంటే కొన్ని గంటల ముందు(మే 7వ తేదీన) తొలిసారి పౌర రక్షణ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఇవాళ మరోసారి చేపట్టారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరి యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అనే అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగానే కేంద్ర హోం శాఖ మాక్ డ్రిల్స్(Mock Drills) నిర్వహించింది. సైరన్ వినగానే ప్రజలు అప్రమత్తమైన చెవులు మూసుకుని కింద పడుకోవడం, సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడం లేదంటే భద్రతా బలగాలే వాళ్లను తరలించడం.. దాడుల్లో గాయపడిన వాళ్లను రెస్క్యూ చేయడం తరహా చర్యలు ఈ డ్రిల్స్లో ఉన్నాయి.

అప్పుడు.. మళ్లీ ఇప్పుడు
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో.. దాదాపు 50 సంవత్సరాల తర్వాత దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపట్టడం గమనార్హం. 1971లో తూర్పు పాకిస్థాన్(ప్రస్తుత బంగ్లాదేశ్), పశ్చిమ పాకిస్థాన్లో పోరాడాల్సి రావడంతో దేశ వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేశారు. అంతకు ముందు 1962, 65 యుద్ధాల సమయంలో కూడా నిర్వహించారు. అయితే.. కార్గిల్ యుద్ధం అప్పుడు జరిగినా.. అది పరిమిత ప్రాంతాల్లోనే జరిగింది.
ఇదీ చదవండి: ప్రముఖ యూట్యూబర్పై కోర్టు ధిక్కార చర్యలు!
Tags : 1