Breaking News

తొండంలేని గణేశుడు.. చేతిలో గొడ్డలి.. ఎక్కడ కొలువయ్యాడంటే..

Published on Wed, 08/27/2025 - 08:52

వినాయకుడు.. అనగానే ఎవరికైనా ముందుగా పెద్ద బొజ్జ, తొండంతో కూడిన విచిత్ర ఆకృతి గుర్తుకు వస్తుంది. అయితే దీనికి భిన్నంగా మానవముఖంతో ఉండే ఏకైక వినాయక ఆలయం ఎక్కడుందో తెలుసా? వినాయక చవితి వేళ ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. భక్తులు విఘ్నేశ్వరుని దర్శనం కోసం బారులు తీరుతారు.

తమిళనాడులోని తిలతర్పణపురిలో నరముఖ గణపతి ఆలయం ఉంది. కూతనూరు పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆది వినాయక దేవాలయం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది.  మానవముఖం కలిగిన ఏకైక వినాయక ఆలయంగా ఈ ఆలయం గుర్తింపు పొందింది. విఘ్నేశ్వరునికి ఏనుగు తల పెట్టకముందు గణేశుని అసలు ముఖం ఇదేనని భక్తులు నమ్ముతారు. ఇక్కడ గణపతిని నరముఖ వినాయకునిగా పూజిస్తారు. ఈ విగ్రహం 5 అడుగుల ఎత్తు ఉంటుంది. నడుము చుట్టూ నాగాభరణం  కనిపిస్తుంది.

గ్రానైట్ తో నరముఖ గణపతి విగ్రహాన్ని రూపొందించారు.  ఈ గణపతి.. గొడ్డలిని చేతితో పట్టుకుని దర్శనమిస్తాడు. మరోచేతిలో మోదకం ఉంటుంది. ఈ విగ్రహాన్ని 7వ శతాబ్దంలో తీర్చిదిద్దారని నమ్ముతారు. ఈ ఆలయం తమిళనాడులోని పురాతన దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. పురాణాలలోని వివరాల ప్రకారం గణేశుడిని పార్వతీదేవి సృష్టిస్తుంది. ఆ తర్వాత జీవం పోస్తుంది. పార్వతీదేవి ఒకరోజు స్నానానికి వెళ్లినప్పుడు గణేషుశుడిని తలుపు వద్ద కాపలాగా ఉంచుతుంది.

కొంత సేపటికి శివుడు గృహానికి రాగా, ఆ ప్రాంగణంలోకి వచ్చేందుకు శివుణ్ణి.. వినాయకుడు అనుమతించడు. దీంతో కోపోద్రిక్తుడైన శివుడు వినాయకుని తల నరుకుతాడు. విషయం తెలుసుకున్న పార్వతి.. శివునిపై ఆగ్రహిస్తుంది. అప్పుడు దేవతలంతా సమావేశమై, మానవముఖానికి బదులుగా పార్వతి తనయునికి ఏనుగు తలను పెట్టి బతికిస్తారు.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)