Breaking News

కంటెంట్‌తగ్గింది గురూ!

Published on Wed, 01/14/2026 - 05:17

సినిమా..భారతీయుల జీవితంలో ఒక భాగం. అతిపెద్ద వినోదం. అభిమాన తారలు, కథ, నటన, పాటలు, హిట్, ఫ్లాప్‌.. ఇలా సినిమా గురించి చర్చలేని కుటుంబమే లేదంటే అతిశయోక్తి కాదు. థియేటర్లో కిటకిటలాడే ప్రేక్షకులు, ఈలలు, చప్పట్లు, చెవులు చిల్లులుపడే శబ్దాల మధ్య మూవీ చూస్తే ఆ థ్రిల్లే వేరు. ఇదంతా గతం. ‘ఆ ఒక్కటి తగ్గింది పుష్ప’అని ఇప్పుడు ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. దేశ వ్యాప్తంగా 2019లో 146 కోట్ల మంది ప్రేక్షకులు వెండి తెర ముందు కూర్చుని సినిమాను ఆస్వాదించారు. 2024లో ఈ సంఖ్య 86 కోట్లకు వచ్చి చేరింది.

అంటే అయిదేళ్లలో థియేటర్లకు వచ్చిన వీక్షకుల సంఖ్య 41% తగ్గిందని మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎంఏఐ) నివేదిక వెల్లడించింది. 2025 జూన్‌–జూలైలో 14,688 మంది సినిమా ప్రేక్షకులపై ఈవై నిర్వహించిన సర్వే, అలాగే నిర్మాతలు, ఇతర భాగస్వాముల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం..140 కోట్లకుపైగా జనాభా ఉన్న మన దేశంలో ఏటా థియేటర్లకు వచ్చి మూవీని ఆస్వాదించేవారి సంఖ్య దాదాపు 15 కోట్లు మాత్రమే.  – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

కొద్ది రోజులకే ఓటీటీల్లో.. 
సినిమా కంటెంట్‌లో నాణ్యత తగ్గిందన్నది ప్రేక్షకుల మాట. అంతేకాదు మూవీస్‌ రిలీజైన కొద్ది రోజులకే ఓటీటీల్లో ప్రత్యక్షం అవుతున్నాయి. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల 
సంఖ్య తగ్గడానికి ఇవే ప్రధాన కారణాలు. కంటెంట్‌ నాణ్యత పడిపోయిందని 55% ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఆకట్టుకునే కథ, సంగీతం, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ మెరుగుపడాలని 70% మంది ఆశిస్తున్నారు.

థియేటర్లకు పరుగు తీయాల్సిన అవసరం లేదని..విడుదలైన ఎనిమిది వారాలలోపు స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లకు వస్తున్నాయని 81% మంది నమ్ముతున్నారు. థియేటర్‌లో రిలీజై ఓటీటీకి వచ్చేందుకు తక్కువ రోజులే ఉంటే సినిమా కోసం వేచి చూస్తామని మూడింట ఒకవంతు మంది చెబుతున్నారు. చేయి తిరిగిన రచయితలు, కథల కొరత ఉందని 78% నిర్మాతలు పేర్కొన్నారు.  

సగం మంది పైరసీతో.. 
భారత్‌లో మొత్తం స్క్రీన్ల సంఖ్య 2019లో 9,527 ఉండగా.. 2024 నాటికి స్వల్పంగా పెరిగి 9,927కి వచ్చి చేరింది. అంటే కేవలం 400 తెరలే కొత్తగా తోడయ్యాయి. 10 లక్షల మంది జనాభాకు స్క్రీన్లు 7.6 నుంచి 6.8కి తగ్గాయి. 10 లక్షల మందికి యునైటెడ్‌ స్టేట్స్‌లో 109, యూకేలో 66, చైనాలో 64 తెరలు ఉన్నాయి. భారత్‌లో 2018–24 నడుమ 1,000 దాకా సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు కనుమరుగయ్యాయి.

మల్టీప్లెక్సులు అయిదేళ్లలో పెట్టుబడులను 12% తగ్గించాయి. భారత్‌లోని దాదాపు 19,000 పిన్‌కోడ్స్‌కుగాను సుమారు 16,350 చోట్ల థియేటర్లే లేవు. సినీ పరిశ్రమను కోలుకోకుండా చేస్తున్న పైరసీ సైతం సమస్యను పెంచుతోంది. వీడియో కంటెంట్‌ యూజర్లలో 51% మంది పైరసీ సైట్లపై ఆధారపడుతున్నారు. వీరిలో నాలుగింట మూడొంతుల మంది 19 నుంచి 34 సంవత్సరాల వయస్సుగల వారు ఉండడం గమనార్హం. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాలు విడుదలైన తర్వాత పైరసీ పెరుగుతోంది.

ఒత్తిడిలో పరిశ్రమ..
ప్రేక్షకుల సంఖ్య తగ్గడం, పరిమిత స్క్రీన్స్, వీక్షణ అలవాట్లలో వేగవంతమైన మార్పుల కారణంగా చలనచిత్ర ప్రదర్శన రంగం నిరంతర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మన దేశంలో మొత్తం మీడియా, వినోద రంగం, విస్తృత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతూనే ఉన్నప్పటికీ.. 2019 నాటి గరిష్ట స్థాయి నుంచి థియేటర్ల రెవెన్యూ తగ్గుతోంది. 2019–24 మధ్య భారతదేశ థియేటర్ల ఆదాయాలు 0.2% వార్షిక రేటుతో క్షీణించాయి. ఇదే సమయంలో మీడియా, వినోద రంగం 5.42%, జీడీపీ 6.6% వృద్ధి చెందాయి. సినిమా ఆదాయం 2019లో రూ.19,100 కోట్ల నుంచి 2024లో రూ.18,746 కోట్లకు పడిపోయింది. 2019లో రూ.100 కోట్లకుపైగా బాక్సాఫీస్‌ కలెక్షన్లు అందుకున్న సినిమాలు 17 ఉంటే.. 2024లో ఇవి 10కి పరిమితం అయ్యాయి. 

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)