Breaking News

‘ప్రొఫైల్‌ ’ నకిలీ.. ‘సైబర్‌’ మకిలి

Published on Mon, 09/01/2025 - 01:33

నకిలీ ప్రొఫైల్, సైబర్‌ వేధింపులు, ప్రొఫైల్‌ హ్యాకింగ్‌.. తీరు ఏదైనా సైబర్‌ నేరాల సంఖ్య భారత్‌లో ఏటా పెరుగుతూనే ఉంది. జనం డిజిటల్‌కు పెద్ద ఎత్తున మళ్లుతుండడం, అదే సమయంలో పూర్తిగా అవగాహన ఉండకపోవడం.. సైబర్‌ నేరగాళ్లకు కలిసి వస్తున్నాయి. ముఖ్యంగా ఆన్ లైన్ , సామాజిక మాధ్యమాల వేదికగా నకిలీ ఆన్ లైన్  ఖాతాలు తెరిచి చేస్తున్న మోసాలే ఎక్కువగా ఉంటున్నాయి. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

ఇతర వ్యక్తులు, బ్రాండ్, సంస్థలా కనిపించడానికి నకిలీ ఆన్ లైన్‌ ఖాతా తెరిచి చేస్తున్న మోసాలు దేశంలో అధికంగా ఉంటున్నాయి. అక్రమంగా డబ్బు సంపాదించే లక్ష్యంతో వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వివరాలను ఉపయోగించి సైబర్‌ నేరస్తులు ఇతరులను మోసం చేస్తున్నారు. గతేడాది ఇలాంటి ఘటనలు నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీn) ద్వారా 39,846 నమోదయ్యాయి. నాలుగేళ్లలో ఈ తరహా మోసాలు మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్ సీఆర్‌పీ వేదిక ద్వారా సైబర్‌ వేధింపుల ఫిర్యాదులు మూడున్నర రెట్లు పెరిగి 39,077కు చేరాయి. ప్రొఫైల్‌ హ్యాకింగ్, గుర్తింపు చోరీ ఘటనలు మూడింతలకుపైగా అధికమై 38,295కు పెరిగాయి. ఆన్ లైన్  జాబ్, మ్యాట్రిమోనియల్‌ మోసాలు కూడా పెరుగుతూ ఉన్నాయి.

కేసులు ఎన్నోరెట్లు..
అధికారిక లెక్కల ప్రకారం గతేడాది దేశవ్యాప్తంగా 22 లక్షలకుపైగా సైబర్‌ సెక్యూరిటీ ఘటనలు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ఆన్ లైన్ , సామాజిక మాధ్యమాల ద్వారా మోసాలు 2020తో పోలిస్తే 2024 నాటికి దాదాపు మూడింతలయ్యాయి. మహిళలు, పిల్లలపై జరుగుతున్న సైబర్‌ నేరాల సంఖ్య రెండింతలకుపైగా పెరిగి గత ఏడాది 48,475కు చేరాయి. సైబర్‌ నేరస్తులు ఇతర దేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్టు వారు ఉపయోగించిన ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ (ఐపీ) అడ్రస్‌లను బట్టి తెలుస్తోంది. సైబర్‌ క్రిమినల్స్‌ చాలా సందర్భాల్లో తప్పుడు లొకేషన్ , గుర్తింపుతో తప్పుదోవ పట్టిస్తున్నట్టు హోం మంత్రిత్వ శాఖ వర్గాలు గుర్తించాయి.

కేటాయింపులు మూడింతలు..
పౌరులు, వ్యాపారాలు, ప్రభుత్వానికి సురక్షిత సైబర్‌స్పేస్‌ను నిర్మించడానికి నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ పాలసీ (ఎన్ సీఎస్‌పీ)ని కేంద్రం తీసుకొచ్చింది. అలాగే దేశంలోని సైబర్‌స్పేస్‌ను జల్లెడ పట్టేందుకు, సైబర్‌ భద్రతా ముప్పులను గుర్తించడానికి నేషనల్‌ సైబర్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ (ఎన్ సీసీసీ) ఏర్పాటు చేసింది. డేటా సంరక్షణ కోసం డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ (డీపీడీపీ) చట్టం–2023 తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్స్, సమాచార మంత్రిత్వ శాఖ సైబర్‌ సెక్యూరిటీ మౌలిక వసతుల కోసం కేటాయించిన నిధులు 5 ఏళ్లలో మూడింతలకుపైగా పెరగడం గమనార్హం.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)