Breaking News

ఈ టర్మ్‌లోనే ‘ఒకే దేశం- ఒకే ఎన్నికల విధానం’

Published on Mon, 09/16/2024 - 08:17

ఢిల్లీ: ఒకే దేశం-ఒకే ఎ‍న్నిక విధానంపై గత కొంత కాలంగా దేశంలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా ఈ అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే ఈ విధానం తప్పకుండా అమల్లోకి వస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఇదే విషయాన్ని నొక్కిచెప్పినట్ల సంబంధిత అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక.. ఇప్పటికే ఒకే దేశం- ఒకే ఎన్నిక విధానం అమలు చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ అధ్యక్షత ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

ఆ కమిటీ ప్యానెల్‌ మొదటి దశగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది. వాటీ తర్వాత సుమారు వంద రోజుల వ్యవధితో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది. ఈ కమిటీ తర్వలోనే లా కమిషన్‌కు కూడా సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

ఇక ఏకకాలంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలను 2029లో నిర్వహించాలని ఇటువంటి పరిస్థితిలో ఒకవేళ హంగ్‌ ప్రభుత్వం ఏర్పడితే, లేదా అవిశ్వాస తీర్మానం వంటి సందర్భంలో ఏకీకృత ప్రభుత్వం కోసం ఓ ప్రత్యేకమైన నిబంధనను రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ సిఫార్సులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ.. ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ అవసరాన్ని నొక్కి చెప్పారు. దశలవారిగా తరచూ ఎన్నికలు నిర్వహించటం.. దేశ పురోగతికి అడ్డంకులు సృష్టిస్తున్నాయని తెలిపారు. 

లోక్‌ సభ ఎన్నికల సమయంలో బీజేపీ ఈ అంశాన్ని ఎన్నకల మేనిఫెస్టోలో సైతం పొందుపర్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విధానాన్ని దానిని అమలు చేయడానికి అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ విధానాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒకేసారి ఎన్నికల నిర్వహిస్తే.. లోక్‌సభ ఎన్నికలపై నేపథ్యంలో ఓటర్లకు స్థానిక సమస్యలను వివరించడానికి తగిన ప్రాధాన్యత ఉండదని ప్రాంతీయ పార్టీలు  పేర్కొంటున్నాయి.

చదవండి: దేశ ప్రజాస్వామ్యానికి 2024 కీలక మలుపు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)