Breaking News

బాలాసోర్ దుర్ఘటన కేసు: ముగ్గురు నిందితులకు బెయిల్

Published on Wed, 10/30/2024 - 19:06

భువనేశ్వర్‌: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గతేడాది జరిగిన రైలు  ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఈ విషాద ఘటనలో 290 మందికి పైగా మృతిచెందారు. ఈ ప్రమాద ఘటన కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులకు ఒరిస్సా హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

నిందితులు మొహమ్మద్ అమీర్ ఖాన్, అరుణ్ కుమార్ మహంత , పప్పు యాదవ్‌లను జులై 7, 2023న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ).. ప్రమాదం జరగడానికి  నిర్లక్ష్యం వహించిన కారణంగా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ ఆదిత్య కుమార్ మోహపాత్ర నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్.. ఒక్కొక్కరికి రూ.50 వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేయాలని ఆదేశించింది.

షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు 2 జూన్, 2023న బాలాసోర్‌లోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో ఢీకొన్నాయి. ఈ ఘనటలో 290 మందికి పైగా మరణించగా.. సుమారు 1,200 మందికి పైగా గాయపడ్డారు.అయితే.. ఉన్నత స్థాయి రైల్వే విచారణలో ప్రమాదానికి ప్రధాన కారణం.. తప్పు సిగ్నలింగ్‌ అని తేలింది.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)