బంగ్లాదేశ్‌ సంక్షోభం: ఒడిశా అప్రమత్తం.. తీరంలో గస్తీ పెంపు

Published on Thu, 08/08/2024 - 11:57

అశాంతితో దెబ్బతిన్న బంగ్లాదేశ్ నుండి భారత్‌లోకి చొరబడాలని చూస్తున్న అక్కడి ప్రజలను అడ్డుకునేందుకు ఒడిశా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 480 కిలోమీటర్ల తీరప్రాంతంలో నిఘాను మరింతగా పెంచింది. ఈ విషయాన్ని సీనియర్ పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

ఒడిశా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు చిన్న పడవలను ఉపయోగించి ఒడిశాలోకి అక్రమంగా ప్రవేశిస్తుంటారన్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో అశాంతి నెలకొన్న సమయంలో, అక్కడి నేరస్తులు జైలు నుండి బయటకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయని అన్నారు. అలాంటి వారు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించే అవకాశాలున్నయని, అందుకే తాము మరింత అప్రమత్తం అయ్యామన్నారు.

నేరస్తులలో పాటు సామాన్యులు కూడా ఒడిశాలోకి చొరబడే అవకాశం ఉన్నందున  రాష్ట్రంలోని 18 మెరైన్ పోలీస్ స్టేషన్లను హై అలర్ట్‌లో ఉంచామన్నారు. మరోవైపు  ఒడిశాలోకి బయటి వ్యక్తుల అక్రమ ప్రవేశాన్ని నిరోధించేందుకు ప్రత్యేకించి రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని కోస్తా జిల్లాల పోలీసు సూపరింటెండెంట్‌లను ఆదేశించింది. కేంద్రపారా, జగత్‌సింగ్‌పూర్‌, భద్రక్‌ తదితర జిల్లాలపై నిఘా సారించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)