Breaking News

లగేజ్‌ సర్దేసుకుని లద్దాఖ్‌, మయూర్‌భంజ్‌కు ఛలో! ఆ రెండే ఎందుకంటారా?

Published on Mon, 03/20/2023 - 05:13

న్యూఢిల్లీ: సమ్మర్‌ హాలీడేస్‌లో ఎక్కడికెవెళ్లాలి? పిల్లా పాపలతో కలిసి ఎక్కడికెళ్తే అన్నీ మర్చిపోయి హాయిగా ఎంజాయ్‌ చేస్తాం? పెద్దగా ఆలోచించకుండా లగేజ్‌ సర్దేసుకొని కశ్మీర్‌లోని లద్దాఖ్‌కో, ఒడిశాలో మయూర్‌భంజ్‌కు ప్రయాణమైపోవడమే! ఆ రెండే ఎందుకంటారా? ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజైన్‌ ప్రపంచవ్యాప్తంగా అత్యంత అద్భుతమైన ప్రాంతాల జాబితా–2023లో మన దేశం నుంచి చోటు దక్కించుకున్న ప్రాంతాలు అవే మరి!

అరుదైన పులులు, పురాతన ఆలయాలు, సాహసంతో కూడిన ప్రయాణం, ఆహా అనిపించే ఆహారం. ఇవన్నీ లద్దాఖ్, మయూర్‌భంజ్‌లకు 50 పర్యాటక ప్రాంతాలతో టైమ్స్‌ రూపొందించిన ఈ జాబితాలో చోటు కల్పించాయి. లద్దాఖ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ అడుగు పెడితే స్వర్గమే తలవంచి భూమికి చేరిందా అనిపించక మానదు. ‘‘మంచుకొండలు, టిబెటన్‌ బౌద్ధ సంస్కృతి కనువిందు చేస్తాయి. అక్కడి వాతావరణాన్ని ఫీల్‌ అవడానికి పదేపదే లద్దాఖ్‌ వెళ్లాలి’’ అని టైమ్స్‌ కీర్తించింది.

‘‘ఇక మయూర్‌భంజ్‌ అంటే పచ్చదనం. సాంస్కృతిక వైభవం, పురాతన ఆలయాలు, కళాకృతులకు ఆలవాలం. ప్రపంచంలో నల్ల పులి సంచరించే ఏకైక ప్రాంతం’’ అంటూ కొనియాడింది. ఏటా ఏప్రిల్లో మయూర్‌భంజ్‌లో జరిగే ‘చౌ’ డ్యాన్స్‌ ఫెస్టివల్‌ అదనపు ఆకర్షణ. ఒడిశా సాంస్కృతిక వారసత్వంతో పాటు ఏకశిలా శాసనాలు గొప్పగా ఉంటాయని టైమ్స్‌ పేర్కొంది. జాబితాలో అత్యధిక శాతం అమెరికా ప్రాంతాలకే చోటు దక్కింది. టాంపా (ఫ్లోరిడా), విల్లామెట్‌ (ఓరెగాన్‌), టక్సాన్‌ (అరిజోనా), యోసెమైట్‌ నేషనల్‌ పార్క్‌ (కాలిఫోర్నియా) వంటివి వాటిలో ఉన్నాయి.  
 

Videos

అల్లు అర్జున్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ..?

నేను నిప్పు, తెరిచిన పుస్తకం అన్నావ్ గా.. మరీ ఈ సీక్రెట్ టూర్ లు ఏంటి?

ఫ్రెండ్స్ తో పందెం కట్టి.. పెన్ను మింగేశాడు

ఈ వయసులో నీకు బుద్ధి లేదా.. MLA బుచ్చయ్య చౌదరిపై రెచ్చిపోయిన చెల్లుబోయిన

స్విట్జర్లాండ్ లో పెను విషాదం.. 40 మంది మృతి ..100 మందికి గాయాలు

చంద్రబాబు మీద ఉన్న ప్రతి కేసు రీ ఓపెన్!

బుజ్జితల్లి టాలీవుడ్ కు వచ్చేస్తుందా..

ప్రేమపెళ్లి చేసుకున్న యువకుడిపై దాడి

800 KG కేక్ కట్టింగ్.. జగన్ ఆశీస్సులతో మనదే విజయం

జగన్ వార్నింగ్ తో చంద్రబాబు సెల్ఫ్ గోల్..

Photos

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

లంగా ఓణీలో 'ఈషా రెబ్బా'.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

హైటెక్ సిటీలో ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు (ఫొటోలు)

+5

హిమాలయాల్లో తిరిగేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

2025లో ఊహించనవి జరిగాయి.. కియారా అద్వానీ జ్ఞాపకాలు (ఫొటోలు)