Breaking News

చిన్నగొడవ, భర్తను మొబైల్‌తో కొట్టింది.. అంతే..!

Published on Mon, 07/13/2026 - 13:23

ఒడిశాలోని బోలాంగిర్ జిల్లాలో జరిగిన ఒక ఘటన కలకలం రేగింది. కుటుంబ గొడవలో భాగంగా భార్య మొబైల్ ఫోన్‌తో తలపై గట్టిగా కొట్టడంతో ఓ భర్త మృతి చెందాడు.  స్వల్ప వివాదం విషాదానికి దారితీయడంతో స్థానిక నివాసితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

అసలేం జరిగిందంటే
పోలీసుల సమాచారం ప్రకారం  శనివారం భార్యాభర్తల మధ్య ఏదో విషయంలో  స్వల్ప వివాదం రేగింది. ప్రారంభమైంది. ఇది కాస్తా ముదరడంతో ఆగ్రహానికి గురైన భార్య, భర్త తలపై మొబైల్ ఫోన్‌తో బలంగా కొట్టింది. దీనితో ఆయన తలకు తీవ్ర గాయమైంది. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం బోలాంగిర్ జిల్లా ప్రధాన ఆసుపత్రి (DHH)కి తరలించారు. అక్కడ అతనికి వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. చికిత్స అనంతరం అతని ఆరోగ్యం మెరుగుపడిందని భావించిన వైద్యులు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడంతో ఆయన ఇంటికి చేరుకున్నారు.

అకస్మాత్తుగా క్షీణించిన ఆరోగ్యం
అయితే, ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. కంగారుపడిన కుటుంబ సభ్యులు మళ్లీ ఆయనను అత్యవసర చికిత్స కోసం జిల్లా ప్రధాన ఆసుపత్రికి పరుగుపరుగున తీసుకువెళ్లారు. వైద్యులు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అసలు వారి మధ్య గొడవకు దారి తీసిన కారణాలేంటి? అతని మరణానికి గల ఖచ్చితమైన కారణాలు ఏంటి అనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల అసలు కారణం స్పష్ట మవుతుందని అధికారులు తెలిపారు. దర్యాప్తులో తేలిన నిజాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా?

#

Tags : 1

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)