Breaking News

నాగలికి ప్రేమికులను కట్టి..

Published on Sat, 07/12/2025 - 08:31

ఒడిశా: ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరిని ఊరు వెలి వేసింది. అంతే కాదు గ్రామ పెద్దలు గ్రామసభలో వారికి దండన విధించారు. ఇద్దరినీ నాగలికి రెండువైపులా కట్టి పొలం దున్నే పనులు చేయించారు. పొలం దున్నే సమయంలో ఇద్దరినీ కర్రలతో కొట్టారు. ఈ అవమానకర ఘటన జిల్లాలోని కల్యాణసింగుపూర్‌ సమితి సికరపాయి సమితి కొంజొమాజొడి గ్రామంలో వారం కిందట జరిగింది. దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం నాడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతొ విషయం బయటకు పొక్కింది.  

వివరాల్లోకి వెళితే... కొంజొమాజొడి గ్రామంలో లకసరక (27) అనే యువకుడు అదే గ్రామంలో కొడియా సరక (32) లు నివసిస్తున్నారు. వరుసకు కొడియా సరక లక సరకకు పిన్ని అవుతుంది. అయితే ఇద్దరి మధ్య గత కొన్నాళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. ఇద్దరూ ఇష్టపడ్డారు. ప్రేమించకున్నారు. అనంతరం కొద్ది రొజుల క్రితం ఇద్దరూ ఊరు విడిచి బయటకు వెళ్లి వివాహం చేసుకున్నారు. విషయం గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు తెలిసింది. 

ఇద్దరిని గ్రామానికి రప్పించారు. గ్రామ సభను నిర్వహించారు. గ్రామ కులదేవత వద్ద ఇద్దరికీ స్నానం చేయించారు. గ్రామ కట్టుబాట్లను కాలరాసినందుకు దండన విధించారు. వెదురు కర్రలతొ రూపొందించిన నాగలికి రెండు వైపులా ఇద్దరిని అందరి సమక్షంలో కట్టి ఎద్దులను కొట్టినట్టు కొట్టి పొలం దున్నే పనులను చేయించారు. అనంతరం వారిని ఊరి నుండి వెలివేశారు. విషయం బయటకు పొక్కడంతో గ్రామానికి చేరుకున్న విలేకరులకు కొందరు విషయం చెప్పారు. 

 

 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)