Breaking News

ఒడిశాలో హోరాహోరీ

Published on Mon, 06/03/2024 - 05:01

భువనేశ్వర్‌: 147 స్థానాలున్న ఒడిశా శాసనసభ ఎన్నికల్లో ఈసారి హోరాహోరీ పోరు తప్పదని ఇండియా టుడే–యాక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌ పోల్‌ వెల్లడించింది. విపక్ష బీజేపీకి 62 నుంచి 80 స్థానాలు లభించే అవకాశం ఉందని, అధికార బిజూ జనతాదళ్‌(బీజేడీ)కి సైతం 62 నుంచి 80 స్థానాలే దక్కే వీలుందని అంచనా వేసింది. దీన్నిబట్టి చూస్తే ఒడిశాలో బీజేపీ అధికారం దక్కించుకొనేందుకు ఆస్కారం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

 ఒకవేళ బీజేడీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే ముఖ్యమంత్రి నవీన్‌ పటా్నయక్‌ రాజకీయ ప్రస్థానం దాదాపు ముగిసినట్లే అని చెప్పొచ్చు. ఆయన ఐదుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. నవీన్‌ పట్నాయక్‌ ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. 

ఒడిశాలో కాంగ్రెస్‌ 5 నుంచి 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొనే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్‌ పోల్‌ వెల్లడించింది. బీజేపీ ఓట్ల శాతం 42 శాతానికి పెరుగుతుందని, బీజేడీ ఓట్ల శాతం 42 శాతం పడిపోతుందని, కాంగ్రెస్‌కు 12 శాతం ఓట్లు లభించే అవకాశం ఉందని తెలియజేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ 112 సీట్లు, బీజేపీ 23, కాంగ్రెస్‌ 9 సీట్లు గెలుచుకున్నాయి. 21 లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి ఏకంగా 18–20 వస్తాయని ఇండియా టుడే అంచనా వేసింది!
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)