Breaking News

ప్ర‌మాద‌స్థాయిలో వాయు కాలుష్యం.. ఢిల్లీలో మళ్లీ స‌రి-బేసి విధానం

Published on Mon, 11/06/2023 - 14:51

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. రోజురోజుకీ వాయు నాణ్యత దారుణంగా పడిపోతుంది. మితిమీరిన కాలుష్యంతో నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నగరాన్ని పొగ మంచు కమ్మేసింది. గత నాలుగు రోజులు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో వాయు నాణ్యత సూచీలు క్రమేపీ క్షీణిస్తున్నాయి. సోమవారం వాయు నాణ్యత సూచి(ఏక్యూఐ) 437కు చేరిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది.

ఈ క్రమంలో కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో మరోసారి సరి- బేసి విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ వెల్లడించారు. నవంబర్‌ 13 నుంచి 20 వరకు ఈ విధానం అమల్లో ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఈ విధానం ప్రకారం.. వాహన రిజిస్ట్రేషన్‌ నంబరు చివర సరి సంఖ్య ఉన్న వాహనాలు ఒక రోజు, బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజు రోడ్లపైకి రావాల్సి ఉంటుంది.

ఈ మేరకు దేశ రాజధానిలో కాలుష్య సంక్షోభంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో పర్యావరణవాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ సోమవారం సంబంధిత అధికారులతో  అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే సరి-బేసిపై నిర్ణయం తీసుకున్నారు. అంతకముందు వెల్లడించిన దాని ప్రకారం BS3 పెట్రోల్‌, BS4 డీసిల్‌ కార్లను నిషేధం సైతం కొనసాగుతుందని మంత్రి గోపాల్‌ రాయ్‌ తెలిపారు.

ఇక ఢిల్లీలో ప్రస్తుతం ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని మంత్రి ఆదేశించారు. పాఠశాలలను కూడా మూసివేయాలని నిర్ణయించారు. 10, 12వ తరగతులు మినహాయించి మిగతా అన్ని పాఠశాలలు నవంబర్‌ 10 వరకు ఉంటాయని తెలిపారు. ఇప్పటివరకు ప్రాథమిక పాఠశాలలకు మాత్రమే సెలవులు ప్రకటించగా.. ఇప్పుడు ఉన్నత పాఠశాలలను కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. అయితే 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు పాఠశాలలు తమ అనుకూలతను బట్టి ఆన్‌లైన్‌ క్లాస్‌లు నిర్వహించుకోవచ్చని సూచించారు.
చదవండి: వాయు కాలుష్యంతో క్యాన్సర్‌? ‘ఎయిమ్స్‌’ నిపుణులు ఏమంటున్నారు?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)