Breaking News

Delhi Baba: ‘స్టీవ్‌ జాబ్స్‌, ఒబామా.. నా ముందు దిగదుడుపే’.. సరికొత్త వాదన

Published on Thu, 09/25/2025 - 15:13

న్యూఢిల్లీ: పలువురు విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీకి చెందిన స్వయం ప్రకటిత  ఆధ్యాత్మిక గురువు చైతన్యానంద సరస్వతి తనను తాను అర్హత కలిగిన మేనేజ్‌మెంట్ గురువునని, ప్రముఖ రచయితనంటూ చెబుతున్నాడు. పైగా ‘స్టీవ్‌ జాబ్స్‌, ఒబామా.. తన ముందు జుజుబీ’.. అటూ సరికొత్త వాదన వినిపిస్తున్నాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి అతని వ్యక్తిగత జీవితంపై పడింది.

పలు విశ్వవిద్యాలయాల నుండి ఏడు గౌరవ డిగ్రీలు
అకడమిక్ రీసెర్చ్ షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లోని చైతన్యానంద ప్రొఫైల్‌లో అతను చికాగో విశ్వవిద్యాలయం బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి  ఎంబీఏ, పీహెచ్‌డీ చేసినట్లు చూపిస్తోంది.  అలాగే అతను పోస్ట్-డాక్టోరల్ డిగ్రీలు, డీలిట్‌ పూర్తి చేసారని, భారతదేశంతో పాటు విదేశాలలోని పలు విశ్వవిద్యాలయాల నుండి ఏడు గౌరవ డిగ్రీలను కలిగి ఉన్నాడని ఆ సైట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ వాదనలు ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న అతని పుస్తక రచయిత పేజీలలోనూ ఉన్నాయి. అతని విద్యాభ్యాస వివరాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, నిజానిజాలు తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు జరుగుతున్నదని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.

స్టీవ్ జాబ్స్ ముందుమాట
తన పుస్తకాలపై చైతన్యానంద తనను తాను ‘అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన రచయిత’గా పరిచయం చేసుకుంటాడు. అతని పుస్తకాలలో ఒకటైన ‘ఫర్గెట్ క్లాస్‌రూమ్ లెర్నింగ్’లో యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ముందుమాటను రాసినట్లు ఉంది. పుస్తకం మొదటి పేజీలో ఈ చైతన్యానంద పుస్తకం.. ప్రపంచానికి అపూర్వమైన మార్గదర్శకాల మాన్యువల్’ అని జాబ్స్ చెప్పినట్లు ప్రచురితమయ్యింది. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చైతన్యానంద పుస్తకం ‘ట్రాన్స్‌ఫార్మింగ్ పర్సనాలిటీ’ని పదేపదే ప్రస్తావించారనే  అనే విషయం బయటకొచ్చింది. ఈ పుస్తకం 2007లో యూరోపియన్, ఉత్తర అమెరికా మార్కెట్లలో బెస్ట్ సెల్లర్లలో ఒకటిగా నిలిచిందని సమాచారం.

రెండు దశాబ్ధాలుగా మహిళలపై వేధింపులు
ఈ పుస్తకంలో ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ-మూన్‌ పేరుతో ప్రశంసా సందేశం కూడా ఉంది. ఆయన ఆ పుస్తకంలో రచయిత గురించి చెబుతూ, ప్రముఖ ప్రొఫెసర్, ప్రముఖ రచయిత, వక్త, విద్యావేత్త, ఆధ్యాత్మిక తత్వవేత్త పరోపకారి, భారతదేశంతో పాటు విదేశాలలో మేనేజ్‌మెంట్ నిపుణునిగా పేర్కొన్నారు. కాగా చైతన్యానంద  ఎడ్యుకేషన్‌ ప్రొఫైల్‌లోని చాలా సమాచారం నకిలీదని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. వసంత కుంజ్‌లోని శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్‌లో విద్యార్థులను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న  నేపథ్యంలో, చైతన్యానంద సరస్వతి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కాగా అతను అతను దేశం విడిచి పారిపోకుండా నిరోధించడానికి పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు. చైతన్యానంద రెండు దశాబ్దాలుగా మహిళలను వేధిస్తున్నాడని దర్యాప్తులో వెల్లడైంది. కాగా జుజుబీ అంటే రేగిపండు.. దీని శాస్త్రీయ నామం జిజిఫస్ జుజుబా (Ziziphus jujuba). రేగిపండు చిన్నగా ఉంటుంది. దేన్నయినా జుజుబితో పోలిస్తే అది 'నా వెంట్రుకతో సమానం' అనే అర్థం వస్తుంది. 

#

Tags : 1

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)