Breaking News

డోన్లతో ఉత్తరాల బట్వాడా.. 10 నిముషాల్లో డెలివరీ

Published on Thu, 01/23/2025 - 12:46

ధర్మశాల: ఉత్తరాల బట్వాడాలో పోస్టల్‌శాఖమరో ముందడుగు వేసింది. హిమాచల్‌ పోస్టల్ విభాగం డ్రోన్‌ల సాయంతో మారుమూల, మంచు ప్రాంతాలకు  ఉత్తరాలను బట్వాడా చేయనుంది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు పోస్టల్‌శాఖ అప్పర్ సిమ్లాలో డ్రోన్ ద్వారా  ఉత్తరాలను డెలివరీ చేసే ట్రయల్‌ను ప్రారంభించింది.

డ్రోన్‌ల సాయంతో సబ్ పోస్టాఫీసు నుండి బ్రాంచ్ పోస్టాఫీసులకు ఐదు నుంచి పది నిమిషాల్లో  ఉత్తరాలు డెలివరీ అవుతున్నాయి. గతంలో ఇలా ఉత్తరాలు చేరడానికి ఒక రోజు పట్టేది. ఈ ట్రయల్ విజయవంతం అయిన దరిమిలా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు పోస్టల్‌ విభాగం హైటెక్ టెక్నాలజీని ఉపయోగించి ఇతర మారుమూల ప్రాంతాలకు కూడా ఉత్తరాలను బట్వాడా చేసే అవకాశం ఏర్పడనుంది.

హిమాచల్‌ తపాలా శాఖ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య డ్రోన్ల ద్వారా సబ్ పోస్టాఫీస్ హట్కోటి నుంచి నందపూర్, కథాసు, ఆంటి, జాధగ్ బ్రాంచ్ పోస్టాఫీసులకు  ఉత్తరాలను పంపుతోంది. ఒకేసారి ఏడు కిలోగ్రాముల వరకు భారాన్ని మోయగల ఈ డ్రోన్ ఐదు నుండి పది నిమిషాల్లో ఏడు నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు ఉత్తరాలను చేరవేసి, తిరిగివస్తోంది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్‌ల ద్వారా  ఉత్తరాల డెలివరీకి సంబంధించిన పూర్తి డేటాను ఆన్‌లైన్‌లో ఉంచుతున్నారు. డ్రోన్ ట్రయల్స్ కోసం ఒక ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు  పోస్టల్‌శాఖ అధికారి ఒకరు తెలిపారు.

ఇది కూడా చదవండి: Republic Day 2025: అందమైన ఈ శకటాలను చూసితీరాల్సిందే

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)