Breaking News

ఇదీ నా గ్యారంటీ 

Published on Sat, 10/18/2025 - 05:18

న్యూఢిల్లీ: మావోయిస్టుల బెడదను పూర్తిగా అంతం చేసే రోజు ఇక ఎంతోదూరంలో లేదని తాను గ్యారంటీ ఇస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అర్బన్‌ నక్సలైట్లను ప్రోత్సహించాయని ఆరోపించారు. నక్సలైట్లు విచ్చలవిడిగా హింసకు పాల్పడుతున్నా పట్టించుకోకుండా కళ్లు మూసుకున్నాయని ఆరోపించారు. 

గత 75 గంటల్లో 303 మంది నక్సలైట్లు ఆయుధాలు అప్పగించి లొంగిపోయారని తెలిపారు. వీరు సాధారణ నక్సలైట్లు కాదని, వారిపై లక్షలాది రూపాయల రివార్డు ఉందని చెప్పారు. నేడు దేశంలో కేవలం మూడు జిల్లాల్లోనే వామపక్ష తీవ్రవాద ప్రభావం బలంగా ఉందన్నారు. 11 ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా 125 జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండేదని వెల్లడించారు. ఆ సంఖ్య ఇప్పుడు 11కు పడిపోయిందన్నారు. వీటిలో మూడు జిల్లాల్లోనే వారి ఉనికి అధికంగా ఉందన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఎన్డీటీవీ వరల్డ్‌ సమ్మిట్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు.

 గత దశాబ్ద కాలంలో వేలాది మంది మావోయిస్టులు హింసా మార్గాన్ని వీడి లొంగిపోయారని పేర్కొన్నారు. గత 50–55 ఏళ్ల కాలంలో నక్సలైట్లు వేలాది మందిని హత్య చేశారని, పాఠశాలలు, ఆసుపత్రులను కూల్చివేశారని వివరించారు. మావోయిస్టు తీవ్రవాదం అనేది యువతకు జరిగిన అన్యాయమేనని అభివర్ణించారు. మొదటిసారిగా తన మనసులోని బాధను బయటకు వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. నక్సలిజం, మావోయిస్టుల హింస నుంచి దేశం విముక్తి పొందే రోజు అతి దగ్గర్లలోనే ఉందని, ఇదీ నా గ్యారంటీ అని తేల్చిచెప్పారు. నక్సలిజం వల్ల నష్టపోయిన ప్రాంతాలు దాదాపు 60 ఏళ్ల తర్వాత మొదటిసారిగా దీపావళి పండుగ నిర్వహించుకోబోతున్నాయని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు.  

అభివృద్ధి, సంక్షేమం కోసం సంస్కరణలు  
దేశ ప్రగతే లక్ష్యంగా సంస్కరణల విషయంలో తమ ప్రభుత్వం దృఢచిత్తంతో ముందుకెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. గత ప్రభుత్వాలు కేవలం కొన్ని అవసరాల రీత్యా సంస్కరణలు తీసుకొచ్చాయని అన్నారు. తమ ప్రభుత్వం మాత్రం పూర్తి అంకితభావం, బలమైన విశ్వాసంతో దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంస్కరణలు అమలు చేస్తోందని ఉద్ఘాటించారు. ప్రతి సంస్కరణను ఒక విప్లవంగా మారుస్తున్నామని స్పష్టంచేశారు. ఉగ్రవాద దాడులు జరిగితే ఇప్పుడు భారత్‌ నిశ్శబ్దంగా ఉండడం లేదని, ముష్కర మూకలపై భీకరస్థాయిలో ప్రతిదాడులు చేస్తోందని తెలిపారు. సర్జికల్‌ దాడులు, వైమానిక దాడులతో విరుచుకుపడుతోందని పేర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ గురించి ప్రస్తావించారు. యుద్ధాలు జరిగినప్పుడు ఆర్థిక ప్రగతి క్షీణిస్తుందని నిపుణులు చెబుతుంటారని, కానీ, అది అబద్ధమని తాము నిరూపించామన్నారు.

అవరోధాలు, స్పీడ్‌బ్రేకర్లు ఏమీ చేయలేవు  
ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు కొనసాగుతున్నాయని, యుద్ధాలు, సంక్షోభాలు కనిపిస్తున్నాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ భారతదేశ అభివృద్ధి పరుగులు ఆగడం లేదన్నారు. ప్రపంచ దేశాలు భారత్‌ గురించి చర్చించుకుంటున్నాయని చెప్పారు. అవరోధాలు, స్పీడ్‌బ్రేకర్లు తమను ఏమీ చేయలేవన్నారు. ఈ ప్రగతి పరుగును ఆపే మూడ్‌లో దేశం లేదన్నారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)