Breaking News

మీ స్టీల్‌ బాటిల్‌ మంచిదేనా?

Published on Sun, 08/02/2026 - 05:44

మన ఆరోగ్యం మనం తాగే నీటిపైనే కాకుండా, ఆ నీటిని నిల్వ ఉంచే పాత్రలపై కూడా ఆధారపడి ఉంటుంది. సాధారణ ప్లాస్టిక్‌ సీసాల వల్ల శరీరంలోకి చేరే బిస్‌ఫెనాల్‌–ఎ (బీపీఏ), సూక్ష్మ ప్లాస్టిక్‌ కణాలు (మైక్రోప్లాస్టిక్స్‌), అతిసూక్ష్మ ప్లాస్టిక్‌ కణాల (నానోప్లాస్టిక్స్‌) ముప్పు నుంచి తప్పించుకోవటానికి చాలామంది స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బాటిళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే, మార్కెట్లో లభించే అన్ని స్టీల్‌ బాటిళ్లూ ఆరోగ్యానికి సురక్షితమైనవి కావు.  

ఏది ఉత్తమమైన స్టీల్‌? 
తాగునీటిని నిల్వ చేయడానికి దేశ విదేశాల్లో ‘304’, ‘316’స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ గ్రేడ్లను అత్యంత సురక్షితమైనవిగా పరిగణిస్తారు. 304 లేదా 18/8 గ్రేడ్‌ స్టీల్‌లో 18% క్రోమియం, 8% నికెల్‌ ఉంటాయి. ఇది తుప్పు పట్టదు. సహజమైన రుచి, వాసనను మార్చదు. 316 లేదా 18/10 గ్రేడ్‌ స్టీల్‌లో అదనంగా 2% నుంచి 3% ‘మాలిబ్డినం’అనే లోహం ఉంటుంది. దీనివల్ల బాటిల్‌కు తుప్పు నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. నిమ్మ/బత్తాయి రసం, మజ్జిగ, డిటాక్స్‌ వాటర్‌ లేదా ఆల్కలైన్‌ వాటర్‌ వంటి ఆమ్ల గుణం ఉన్న పానీయాలను పోసుకోవటానికీ ఇది అత్యంత సురక్షితమైనదని నిపుణులు చెబుతున్నారు.  

సాధారణ స్టీల్‌తో ముప్పు 
నాసిరకం సాధారణ స్టీల్‌ బాటిళ్లు తాగు నీటిని పోసుకోవటానికి గానీ, పండ్ల రసాలకు గానీ పనికిరావు. తక్కువ ధరకు లభించే బాటిళ్ల తయారీలో 201/202 గ్రేడ్‌ స్టీల్‌ వాడతారు. తయారీ వ్యయం తగ్గించడానికి వీటిలో ఖరీదైన నికెల్‌ వాడకాన్ని తగ్గించి, 5.5%–7.5% వరకు ‘మాంగనీస్‌’ను కలుపుతారు. ఈ బాటిళ్లలో నీరు లేదా పండ్ల రసాలు పోసినప్పుడు మాంగనీస్‌ నీటిలో కరుగుతుంది. ఇది రోజూ శరీరంలోకి చేరితే కాలక్రమేణా కేంద్ర నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ బాటిళ్లకు తుప్పును తట్టుకునే శక్తి తక్కువ. కొద్దిరోజులకే లోపల ఎర్రటి తుప్పు మచ్చలు ఏర్పడి, నీటిలోకి లోహపు రుచి/వాసన వస్తుంది. 

నాణ్యతను గుర్తించేదెలా? 
» భారతీయ ప్రమాణాల ప్రకారం.. స్టీల్‌ బాటిళ్ల తయారీలో ‘ఐఎస్‌ 17803:2022’, థర్మోస్‌/వ్యాక్యూమ్‌ బాటిళ్ల తయారీలో ‘ఐఎస్‌ 17526:2021’నిబంధనలు పాటించాలి. ఐఎస్‌ఐ ముద్రనూ తప్పనిసరిగా బాటిల్‌పై ముద్రించాలి.  

» అమెరికా ఎఫ్‌డీఏ, యూరోపియన్‌ ఈఎఫ్‌ఎస్‌ఏ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం.. 304/316 గ్రేడ్‌ స్టీల్‌ బాటిల్స్‌ మాత్రమే సురక్షితమైనవి. మన దేశంలో కొత్త స్టీల్‌ బాటిల్‌ కొనేముందు దాని అడుగు భాగంలో లేదా ప్యాకింగ్‌ బాక్స్‌పై 304 లేదా 316తోపాటు ఐఎస్‌ఐ మార్కు ఉందో లేదో చూసుకోవాలి. 

» సాధారణ 201 లేదా 202 గ్రేడ్‌ స్టీల్‌ బాటిళ్ల అడుగున లేదా బాక్స్‌పై ఈ అంకెలను రాయొచ్చు లేక రాయకపోవచ్చు. మనమే గమనించుకోవాలి.  

– (సాక్షి, స్పెషల్‌ డెస్క్‌) 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)