Breaking News

పిల్లలు ఆరుబయట ఆడాలంటే మాస్క్‌ ధరించాల్సిరావడం దారుణం

Published on Sun, 03/30/2025 - 06:02

న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో చిన్నారులు ఆడుకోవాలంటే మాస్క్‌ ధరించాల్సిన దుస్థితి దాపురించొద్దని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. కాలుష్య ఉద్గారాల ఉధృతికి అడ్డుకట్టవేయాలని, కాలుష్యం కట్టడి కోసం తగు ‘స్వచ్ఛ’సాంకేతికతలపై పెట్టుబడులు పెరగాలని ఆయన అభిలíÙంచారు. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మొదలైన వాతావరణ జాతీయ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. 

‘‘దేశ రాజధాని గత కొంతకాలంగా కాలుష్య రాజధానిలా తయారైంది. కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. పిల్లలు ఆరుబయట ఆడుకోవాలంటే మాస్క్‌ ధరించాల్సిన దారుణ పరిస్థితులు రావడం శోచనీయం. ఇంత తక్కువ వయసులో కాలుష్యమయ గాలి పీల్చడం వల్ల ఎన్నో శ్వాససంబంధ వ్యాధులు చుట్టుముడతాయి. కాలుష్య ఉద్గారాల వెల్లువకు అడ్డుకట్టపడాల్సిందే. ఇందుకోసం మనందరం సమైక్యంగా నిలబడి తక్షణ కార్యాచరణతో రంగంలోకి దిగాలి. 

ఆర్థికాభివృద్ధికి, పర్యావరణహిత విధానానికి సమతూకం  సాధించాలి. శుద్ధ సాంకేతికతల అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు విధాన నిర్ణయాలు తీసుకోవాలి. పర్యావరణానికి హాని కల్గించని టెక్నాలజీలపై దృష్టిసారించాలి. తక్కువ ఉద్గారాలను  వెదజల్లే రవాణా విధానాలను అవలంభించాలి. అలాంటప్పుడు మనం పీల్చే గాలి గరళంగా మారకుండా ఉంటుంది. నీటి కాలుష్యం సైతం మరో తీవ్ర సమస్యగా తయారైంది. శుద్ధికి నోచుకోని వ్యర్థాలు నేరుగా నదీజలాల్లో కలిసిపోతున్నాయి. 

పారిశ్రామిక వ్యర్థాలు నదీజలాల్లో కలవకుండా అడ్డుకోవాలి. మురుగునీటిని శుద్ధిచేశాకే నదీజలాల్లోకి వదలాలి. నదీతీరాల్లోని స్థానిక ప్రజానీకం సైతం వ్యర్థాలను నేరుగా నదుల్లో పడేయకుండా తమ వంతు బాధ్యతగా మెలగాలి’’అని జడ్జి అన్నారు. కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ఛైర్‌పర్సన్, అటార్నీ జనరల్, తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు.   
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)