Breaking News

Uttar Pradesh: మెట్రో స్టేషన్‌ వద్ద కాల్పులు.. యువకుని మృతి

Published on Mon, 09/16/2024 - 11:21

నోయిడా: యూపీలోని నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. సెక్టార్ 137 మెట్రో స్టేషన్ దిగువన ఒక యువకునిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనతో ఈ ప్రాంతంలో కలకలం చెలరేగింది. నిందితులను పట్టుకునేందుకు ఆరు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

మీడియాకు అందిన వివరాల ప్రకారం నోయిడా సెక్టార్ 137 మెట్రో స్టేషన్ దిగువన ఉన్న ఫుడ్ కోర్టులో ఒక యువకునిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడిని నవేంద్ర కుమార్ ఝాగా పోలీసులు గుర్తించారు.

ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేశామని, వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈ ఘటన గురించి అదనపు సీపీ శివ హరి మీనా మాట్లాడుతూ ఆస్తి విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం నడుస్తోందని, ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఇరువర్గాలు మెట్రో స్టేషన్ 137 కింద సమావేశమయ్యాయన్నారు. అయితే ఇంతలోనే ఒక వర్గానికి చెందిన వారు నవేంద్ర కుమార్ ఝాపై కాల్పులు జరిపారన్నారు.

బుల్లెట్ నవేంద్ర తలకు తగిలిందని, ఆసుపత్రిలో చేర్పించాక అక్కడ మృతి చెందాడన్నారు. నవేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాల్పులు జరిపినవారిని గుర్తించామని, ఇరువర్గాలు వారు ఘజియాబాద్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. సెక్టార్ 82లోని ఆస్తి విషయంలో వీరి మధ్య వివాదం నడుస్తోందన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: విదేశీయుల్లా ఉ‍న్నారంటూ బాలికలకు వేధింపులు

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)