Breaking News

వీడియో వైరల్‌: ‘కాలింగ్‌ బెల్‌’ తెచ్చిన తంటా..

Published on Tue, 01/27/2026 - 09:20

ఢిల్లీ: ఒక చిన్న పొరపాటు తీవ్ర ఘర్షణకు దారితీసింది. శనివారం రాత్రి గ్రేటర్ నోయిడాలోని బీటా-2 ప్రాంతంలోన నింబస్ సొసైటీలో ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాత్రి 10 గంటల సమయంలో ఒక డెలివరీ బాయ్‌ పొరపాటున వేరే ఫ్లాట్ కాలింగ్ బెల్ కొట్టాడు.. దీంతో ఆగ్రహంతో సదరు ఫ్లాట్ యజమాని సెక్యూరిటీ గార్డులను పిలిచాడు.

సెక్యూరిటీ గార్డులకు, డెలివరీ ఏజెంట్‌కు మధ్య వాగ్వాదం మొదలై చివరకు అది దాడికి దారితీసింది. డెలివరీ బాయ్‌ తన స్నేహితులకు ఫోన్ చేయడంతో, 12 మందికి పైగా యువకులు బైక్‌లపై కర్రలు, రాడ్లతో సొసైటీ మెయిన్ గేట్ వద్దకు చేరుకున్నారు. ఇరువర్గాలు కర్రలు, రాడ్లు, పిడిగుద్దులతో పరస్పరం దాడులకు దిగారు. 

‘‘పొరపాటున బెల్ కొట్టినందుకు సెక్యూరిటీ గార్డులు డెలీవరి బాయ్‌పై దాడి చేశారు. ఆగ్రహించిన డెలీవరి బాయ్‌ తన తోటి మిత్రులను పిలవడంతో గొడవ తీవ్రరూపం దాల్చింది" అంటూ ఓ సంస్థ ఈ వీడియో ట్వీట్‌ చేసింది. గొడవ జరిగిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూడగానే బైక్‌లపై వచ్చిన వారు పారిపోయారు. కొందరైతే తమ వాహనాలను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు.  ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్‌ చేశారు. వీరిలో బెల్ కొట్టిన డెలివరీ ఏజెంట్‌తో పాటు గొడవకు దిగిన ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. బైక్‌లపై వచ్చి దాడిలో పాల్గొన్న మిగిలిన యువకులు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)