Breaking News

టూ వీలర్లపై టోల్‌ చార్జీలుండవ్‌: గడ్కరీ

Published on Fri, 06/27/2025 - 04:36


సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు ఎటువంటి టోల్‌ చార్జీలను తాము విధించడం లేదని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) స్పష్టం చేసింది. జూలై 15 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై టూ వీలర్లకు కూడా టోల్‌ చార్జీలు వసూలు చేస్తున్నట్లు జాతీయ మీడియాలో వస్తున్న కథనాలన్నీ అవాస్తవమని కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ  గురువారం ‘ఎక్స్‌’ వేదికగా స్పష్టం చేశారు. 

ఇటువంటి కట్టుకథలు, తప్పుడు వార్తలను ఎవరూ నమ్మొద్దని కోరారు. ‘ద్వి చక్రవాహనాలకు టోల్‌ రుసుము వసూలు ప్రతిపాదనేదీ మా పరిశీలనలో లేదు. అటువంటి యోచన చేయడం లేదు. టూ వీలర్స్‌కు టోల్‌ ఛార్జీలంటూ వచ్చేవన్నీ ఫేక్‌ వార్తలు’ అంటూ ఎన్‌హెచ్‌ఏఐ, మంత్రి గడ్కరీ వేర్వేరుగా సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. జాతీయ రహదారులపై ఇప్పటి వరకూ ఫోర్‌ వీలర్స్, భారీ వాహనాలకు మాత్రమే టోల్‌ వసూలు చేస్తున్నారు. ఈ విధానంలో మార్పునకు కేంద్రం శ్రీకారం చుట్టినట్లు ప్రముఖ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. దీంతో, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీరును నెటిజన్లు సోషల్‌ మీడియాలో తప్పుబట్టారు. అసత్యాల ప్రచారంపై ఎన్‌హెచ్‌ఏఐ, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ మేరకు స్పష్టతనిచ్చారు. 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)