Breaking News

మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశ

Published on Fri, 09/15/2023 - 14:00

ఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను అక్టోబర్ 4కు వాయిదా వేసింది న్యాయస్థానం. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు విచారణ చేపట్టింది. 

అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య సీమాను కలుసుకునేందుకు మానవతా దృక్పథంతో  మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భార్య ఆరోగ్యం క్షీణిస్తోందని ధర్మాసనానికి విన్నవించుకున్నారు. సిసోడియా తరపున హాజరైన సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సంఘ్వీ వాదనలు వినిపించారు. తన తరుపున వాదనలకు రెండు గంటల సమయం ఇవ్వాలని బెంచ్‌ను కోరారు. తమ క్లయింట్ అభ్యర్ధనపై తక్షణం ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరారు. 

ఢిల్లీ మద్యం కుంభకోణం..
ఢిల్లీ ఎక్సైజ్ పోర్టుఫోలియోను నిర్వహించే క్రమంలో మధ్యం కుంభకోణం జరిగిందని సీబీఐ మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది. ఢిల్లీ ప్రభుత్వంలో ఆయన ఉపముఖ్యమంత్రి పదవిని కూడా నిర్వర్తించారు. అయితే.. మద్యం కుంభకోణంలో ఫిబ్రవరి 26న సీబీఐ ఆయన్ని అరెస్టు చేసింది. అప్పటి నుంచీ కస్టడీలోనే ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ కూడా సిసోడియాపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28న ఢిల్లీ ప్రభుత్వంలో తన పదవులకు సిసోడియా రాజీనామా చేశారు. 

ఇదీ చదవండి: Nuh Violence: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. ఇంటర్నెట్ బంద్..

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)