Breaking News

ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే

Published on Wed, 05/01/2024 - 12:35

సాక్షి, చెన్నై : గల్లంతైన వారి పేర్లన్నీ మళ్లీ జాబితాలో చేర్పించి ఓటింగ్‌కు అవకాశం కల్పించాలని ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓ ఓటరు దాఖలు చేసిన పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిందని, కౌంటింగ్‌ నిలుపుదల కోసం స్టే ఇవ్వలేమని పేర్కొంటూ ఓటరు పిటిషన్‌ విచారణను ముగించారు. వివరాలు.. ఆస్ట్రేలియా నుంచి వచ్చి తన హక్కును వినియోగించుకునేందుకు ప్రయత్నించిన వైద్యుడు స్వతందిర కన్నన్‌కు కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో నిరాశే మిగిలిన విషయం తెలిసిందే. ఓటరు జాబితాలో తన పేరు గల్లంతు కావడాన్ని తీవ్రంగా పరిగణించారు.

తన లాంటి వారెందరి పేర్లో జాబితాలో గల్లంతు కావడాన్ని పరిగణించి హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. గల్లంతైన వారి పేర్లను మళ్లీ జాబితాలో చేర్చాలని, ఓటుహక్కుకలి ్పంచాలని విన్నవించాడు. ఈ పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్వీ గంగాపూర్వాల, న్యాయమూర్తి చంద్రశేఖరన్‌ బెంచ్‌ విచారించింది. ఎన్నికల కమిషన్‌ తరపున సమగ్ర వివరాలను కోర్టు ముందు ఉంచారు. జనవరిలోనే తుది ఓటరు జాబితాను ప్రకటించడం జరగిందని గుర్తించారు. పిటిషనర్‌ సంబం«ధిత నియోజకవర్గం లేరని, ఆయన ఆ్రస్టేలియాలో నివాసం ఉన్నారని వివరించారు. 2021లోనే జాబితా నుంచి పిటిషనర్‌ పేరు తొలగించ బడ్డట్టు, తుది ఓటరు జాబితా ప్రకటించిన సమయంలో ఎందుకు పిటిషనర్‌ ఆక్షేపన వ్యక్తం చేయలేదన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

తుది ఓటరు జాబితా సమయంలోనే పరిశీలించి ఉండాలని, ఫిర్యాదులు ఉంటే ఎన్నికల కమిషన్‌ దృష్టికి అప్పుడే తీసుకొచ్చి ఉండాలని వాదించారు. వాదనల అనంతరం న్యాయమూర్తులు స్పందిస్తూ, రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిందని, ఇప్పుడు కొత్తగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. పేర్లు మళ్లీ జాబితాలో చేర్పించి ఓటింగ్‌కు అవకాశం కల్పించాలన్న పిటిషనర్‌ వాదనపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమన్నారు. అలాగే, కోయంబత్తూరు నియోజకవర్గం ఎన్నికల కౌంటింగ్‌ను నిలుపుదల చేయలేమని పేర్కొంటూ, ఈ పిటిషన్‌ విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించారు. కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వక పోవడంతో ఓటరుకు మిగిలింది నిరాశే. సర్కారు సినిమాలో తరహా ఏదేని ఉత్తర్వులు వస్తాయన్న ఎదురు చూపులలో ఉన్న వారికి భంగపాటు తప్పలేదు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)